- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హ్యాపీ బర్త్‌డే మై డియర్ బ్రదర్ అంటూ గ్లోబల్ స్టార్‌కి విష్ చేసిన యంగ్ టైగర్ .. ట్వీట్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా దూసుకుపోతున్నాడు. అయితే నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు. దీంతో సినిమా సెలబ్రిటీల దగ్గర నుంచి మెగా అభిమానుల వరకు సోషల్ మీడియా వేదికగా చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) కూడా రామ్ చరణ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. సంతోషంగా ఉండండి.. అండ్ ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ ఇలాగే ఆశీర్వదించాలి’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నేడు గ్లోబల్ స్టార్ నటిస్తున్న ‘ఆర్ సీ-16’(RC-16) సినిమాకు ‘పెద్ది’(Peddi) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్‌లో చరణ్ ఊరమాస్ లుక్‌లో సినిమాపై మరింత హైప్ పెంచేశాడు.