స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

by Naveena |
స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి
X

దిశ, బడంగ్ పేట్​ :రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగి రాజ్ భూపాల్ గౌడ్ అన్నారు. జిల్లా నూతన అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ..పతంగి రాజ్ భూపాల్ గౌడ్ తో సోమవారం నాదర్ గుల్​ గ్రామం శక్తి కేంద్ర ఇంచార్జి, బిజెపి సీనియర్ నాయకుడు నిమ్మల రవికాంత్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ముందుగా జిల్లా నూతన అధ్యక్షునికి తమ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా భూపాల్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని, ఇదే మంచి అవకావమని, రంగారెడ్డి జిల్లాలో భారతీయజనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేయాలని అన్నారు.

ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రతి కార్యకర్త సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు ఏనుగు రామ్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ పెత్తుల పుల్లారెడ్డి , సింగిల్ విండో డైరెక్టర్ తోట ప్రతాప్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగు రామిరెడ్డి, మాజీ వార్డు సభ్యులు మర్రి అంజి రెడ్డి, గూడూరు చంద్రశేఖర్ రెడ్డి , అందెల ఐలయ్య యాదవ్, తోట అరవింద్ రెడ్డి, యాతం వెంకటేష్ యాదవ్, మంత్రి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మంత్రి కృష్ణ, వంక ప్రభాకర్, సతీష్ నంద, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed