- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BC Jindal Group: పునరుత్పాదక ఇంధన రంగంలోకి అడుగుపెడుతున్న బీసీ జిందాల్ గ్రూప్
దిశ, బిజినెస్ బ్యూరో: భారత పునరుత్పాదక ఇంధన రంగంలోకి అడుగుపెడుతున్నట్టు బీసీ జిందాల్ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రకటనలో వచ్చే ఐదేళ్ల కాలానికి 2.5 బిలియన్ డాలర్ల(రూ. 20 వేల కోట్లకు పైగా) పెట్టుబడుల ప్రణాళిక సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఒడిశాలోని అంగుల్‌లో ఇప్పటికే 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ఉత్పత్తిని పోర్ట్‌ఫోలియోతో రెన్యూవబుల్ ఎనర్జీ వెంచర్‌ను ప్రారంభించినట్టు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే బీసీ జిందాల్ గ్రూప్ దేశీయంగా పునరుత్పాదక విద్యుదుత్పత్తి, సోలాస్ మాడ్యూల్స్, సెల్స్ తయారీ వ్యాపారాన్ని కలిగి ఉంది. భవిష్యత్తులో జిందాల్ ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ, విండ్, సోలార్, హైబ్రిడ్, ఎఫ్‌డీఆర్ఈ మోడ్‌ల నుంచి 5 గిగావాట్ల విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేసే లక్ష్యాలను నిర్దేశించినట్టు వివరించింది. సోలార్ డిమాండ్‌ను తీర్చేందుకు పీవీ సెల్స్, మాడ్యూల్స్ తయారీ చేయనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం బీసీ జిందాల్ గ్రూప్ దేశవ్యాప్తంగా వివిధ వ్యాపారాల్లో రూ. 18,000 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది.