Textile: భారత వస్త్ర పరిశ్రమను ప్రభావితం చేస్తున్న బంగ్లా సంక్షోభం

by Harish |
Textile: భారత వస్త్ర పరిశ్రమను ప్రభావితం చేస్తున్న బంగ్లా సంక్షోభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో ఏర్పడినటువంటి రాజకీయ అనిశ్చితి కారణంగా భారతీయ వస్త్ర పరిశ్రమ కొంత ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. అక్కడి కంపెనీలు తమ ఆర్డర్‌లను చాలా వరకు పెండింగ్‌లో పెట్టాయి. దీంతో ఎగుమతులు క్రమంగా తగ్గుతున్నాయి. బంగ్లాదేశ్ దుస్తుల పరిశ్రమ $45 బిలియన్ల మార్కెట్‌ను కలిగి ఉంది, దాదాపు నాలుగు మిలియన్లకు పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఇటీవలి రాజకీయ గందరగోళం నేపథ్యంలో పరిశ్రమ మొత్తం కూడా ఒత్తిడిలో ఉంది.

భారత్ బంగ్లాదేశ్‌కు ముడి పదార్థాలు, ఇతర ఇన్‌పుట్ వస్తువులను సరఫరా చేస్తుంది. ముఖ్యంగా దేశీయ పత్తి ఎగుమతులకు బంగ్లాదేశ్ ప్రధాన గమ్యస్థానం. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ దుస్తుల పరిశ్రమకు $2.4 బిలియన్ల విలువైన పత్తి ఎగుమతి అవుతుంది. ఇది దేశీయ పత్తి ఉత్పత్తిదారులకు కీలక మార్కెట్‌. భారతదేశం మొత్తం పత్తి ఎగుమతుల్లో బంగ్లాదేశ్ వాటా ఎఫ్‌వై13లో 16.8 శాతం నుండి ఎఫ్‌వై24లో 34.9 శాతానికి పెరిగిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు వ్యతిరేకంగా ఉండటంతో ఆర్డర్‌లు చాలా వరకు తగ్గిపోయాయి.

బంగ్లా నుంచి వస్తున్న పాత ఆర్డర్‌లను కొంత వరకు డెలివరీ చేసినప్పటికి సంక్షోభం వలన కొత్త ఆర్డర్‌లను మాత్రం అక్కడి కంపెనీలు తాత్కాలికంగా ప్రక్కన పెట్టాయి. ఇటీవల ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్ సైతం,, బంగ్లాదేశ్ పరిశ్రమ బలహీనమైన విద్యుత్ ఉత్పత్తి , రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పోరాడుతోందని, బంగ్లాదేశ్‌లో పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగించే అంశంగా ఉందని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed