- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏథర్ నుంచి సరికొత్త ఈవీ స్కూటర్.. సింగిల్ చార్జింగ్‌తో 125 కి.మీ
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఏథర్ ఇండియాలో కొత్త మోడల్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘ఏథర్ రిజ్తా’. ఇది ఇద్దరు ప్రయాణీకులకు సౌకర్యవంతంగా కూర్చునేలా పెద్ద సీటు, ముందు సామాన్లు పెట్టుకోడానికి విశాలమైన ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్‌ను కలిగి ఉంది. దీనిలో రిజ్తా ఎస్, జడ్ వేరియంట్లు ఉన్నాయి. రిజ్తా ఎస్ ప్రారంభ ధర రూ. 1.10 లక్షలు(ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఇది కేవలం సింగిల్ చార్జింగ్‌లో 125 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
జడ్ వేరియంట్ ధర రూ.1.25 లక్షలు. ఇది కూడా 125 కి.మీ రేంజ్ అందిస్తుంది, దీనిలోనే టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.1.45 లక్షలు, ఇది 160 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ల టాప్ స్పీడ్ గంటకు 80 కి.మీ. ఈ స్కూటర్ల బుకింగ్‌లు త్వరలో ప్రారంభమవుతాయి. రూ.999 చెల్లించి ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీలు జులైలో ఉంటాయి. ఇవి కేవలం 3.7 సెకన్లలో 0 నుండి 40 kmph స్పీడ్‌ను అందుకుంటాయి.
స్కూటర్ల డ్యాష్‌బోర్డ్‌లో WhatsApp ఇంటిగ్రేషన్, మెసేజ్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కాల్స్, లైవ్ లొకేషన్ షేరింగ్, GPS, ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్ సెటప్, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు సింగిల్ షాక్ అబ్జార్బర్, పార్క్ అసిస్ట్, ఆటో హిల్ హోల్డ్, రైడింగ్ డేటా వంటివి ఉంటాయి. రిజ్టా స్కూటర్‌తో పాటు, ఏథర్ ఎనర్జీ తన హాలో స్మార్ట్ హెల్మెట్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.14,999, లాంచ్ ఆఫర్‌తో రూ.12,999కే లభిస్తుంది.