ఐఫోన్15 సిరీస్ స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని ప్రకటించిన యాపిల్!

by Vinod kumar |   ( Updated:2023-08-30 10:47:55.0  )
ఐఫోన్15 సిరీస్ స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని ప్రకటించిన యాపిల్!
X

న్యూఢిల్లీ: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐఫోన్ ప్రేమికులకు యాపిల్ సంస్థ శుభవార్త ప్రకటించింది. ఈ ఏడాదికి సంబంధించి కొత్త మోడల్ ఐఫోన్15 సిరీస్ విడుదల తేదీని బుధవారం వెల్లడించింది. సెప్టెంబర్ 12న కంపెనీకి చెందిన ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు యాపిల్ వాచ్‌లను విడుదల చేయనుంది. యాపిల్ సంస్థ ప్రతి సంవత్సరం అతిపెద్ద ఈవెంట్ నిర్వహించి ఆ ఏడాదికి సంబంధించిన లేటెస్ట్ యాపిల్ సిరీస్ ఐఫోన్ మోడళ్లను లాంచ్ చేస్తుంది. అలాగే ఈసారి ఐఫోన్15, ఐఫోన్ 15ప్లస్, ఐఫోన్15 ప్రో, ఐఫోన్15 ప్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను, యాపిల్ వాచ్9 సిరీస్, యాపిల్ వాచ్ అల్ట్రా2లను లాంచ్ చేయనుందని సమాచారం. ఈ ఏడాది ఐఫోన్‌ల విడుదలకు సంబంధించి యాపిల్ సంస్థ ఎక్కువ ఒత్తిడికి గురవుతోంది.

స్మార్ట్‌ఫోన్‌లతో పాటు తన ఇతర పరికరాలకు డిమాండ్ కొరవడిన కారణంగా గత మూడు త్రైమాసికాల్లో బలహీన అమ్మకాలను చూసింది. ఈ సమయంలో భారత కొత్త ఉత్పత్తులు కంపెనీ విక్రయాల వృద్ధిని పునరుద్ధరిస్తాయని కంపెనీ ఆశిస్తోంది. ఈ కార్యక్రమంలో యాపిల్ ఐఫోన్15 సిరీస్‌లో రెండు ఎంట్రీ-లెవల్, రెండు హై-ఎండ్ మోడళ్లను విడుదల చేస్తుంది. ఐఫోన్15, 15ప్లస్ గతేడాది ప్రో మోడల్ ఫీచర్లను పొందనుండగా, హై-ఎండ్ మోడళ్లు స్టెయిన్‌స్టీల్‌కు బదులుగా టైటానియం రీడిజైన్, ఏ17 ప్రాసెసర్‌తో రానున్నాయి. ఇంకా అనేక కొత్త ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకోనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story