Apollo Hospitals Q2 Results: రెండో త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ లాభం రూ. 379 కోట్లు

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-07 15:45:17.0  )
Apollo Hospitals Q2 Results: రెండో త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ లాభం రూ. 379 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోని ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ(Health Care Organization) అపోలో హాస్పిటల్స్(Apollo Hospitals) గురువారం జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2FY25) ఫలితాల్లో అపోలో హాస్పిటల్స్ రూ. 379 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 233 కోట్లతో పోలిస్తే, ఈ సారి సంస్థ లాభాలు 63 శాతం పెరిగాయని తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం 15 శాతం వృద్ధితో రూ. 4,846 కోట్ల నుంచి రూ. 5,589 కోట్లకు చేరినట్లు తెలిపింది. త్రైమాసిక ఫలితాలపై అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి(Chairman Pratap C. Reddy) మాట్లాడుతూ.. ఈ ఫైనాన్సియల్ ఇయర్(Financial Year)లో సంస్థ నిర్దేశించుకున్న మైలురాళ్లు అందుకున్నామని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, క్యాన్సర్ ట్రీట్ మెంట్(Cancer Treatment)ల్లో కొత్త వైద్య విధానాలను ప్రవేశపెట్టబోతున్నామని పేర్కొన్నారు. అలాగే చిల్డ్రన్స్(Childrens)కు ఫ్రీగా గుండె శాస్త్రచికిత్సలు చేయడానికి త్రిపుర ప్రభుత్వం(Tripura Govt)తో ఒప్పందం కుదర్చుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story