- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్ వృద్ధి వేగానికి ప్రైవేట్ పెట్టుబడులే సాక్ష్యం: సీఈఏ
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ వృద్ధిలో దూకుడు కనిపిస్తోందని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి అనంత నాగేశ్వరన్ అన్నారు. ప్రైవేట్ రంగ పెట్టుబడుల్లో ఇది స్పష్టంగా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. 'ప్రస్తుతం భారత ఆర్థికవ్యవస్థ 7 శాతంతో వృద్ధిని నమోదు చేస్తోంది. పీఎంఐ, తయారీ, సేవల రంగాల సూచీలు, స్టాక్ మార్కెట్ ర్యాలీని చూస్తే వృద్ధి వేగం తెలుస్తుందని' తెలిపారు. ఆర్థికవ్యవస్థ వేగవంతంగా పెరుగుతోందనేందుకు ప్రైవేట్ పెట్టుబడులు, జీడీపీ వృద్ధే సాక్ష్యం. ప్రైవేట్ రంగంలో లిస్టెడ్ కంపెనీలు తమ మూలధన వ్యయం, కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్నాయి. ఇటీవల కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నట్టు స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తక్కువ రుణాలు తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున క్రెడిట్ లభిస్తుందని మంగళవారం జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనంత నాగేశ్వరన్ వివరించారు. ముఖ్యంగా గత కొంతకాలంగా స్టీల్, సిమెంట్, పెట్రోలియం వంటి కీలక రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు ఊపందుకున్నాయి. కార్పొరేట్, బ్యాంకింగ్ రంగాల బ్యాలెన్స్ షీట్‌లు సైతం ఎక్కువ రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ తరుణంలో భారత వాస్తవ జీడీపీ 7 శాతంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.