- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మధ్యంతర బడ్జెట్‌పై ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు
దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యంతర బడ్జెట్‌పై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌ను ఆయన స్వాగతించారు. అలాగే, ప్రతి ఏడాది బడ్జెట్ చుట్టూ చాలా డ్రామా ఉంటుంది, ఇది అంచనాలను పెంచుతుందని ఎక్స్‌లో అన్నారు. బడ్జెట్ అనేది ఏడాది పొడవునా జరుగుతుందని, అన్ని కుటుంబాలకు మాదిరిగానే బడ్జెట్ కూడా మన ఆర్థిక ప్రణాళికను ముందుగా ప్లాన్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుందని తెలిపారు.
బడ్జెట్ పట్ల సంతోషం వ్యక్తం చేయడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. తక్కువ సమయంలో జరిగినటువంటి ప్రసంగం సంక్షిప్తంగా పూర్తి వివరణతో ఉందని అన్నారు. ఎన్నికల ముందు బడ్జెట్‌లో ఎలాంటి ప్రజాకర్షక ప్రకటనలు రాకపోవడం ఊహించినదే. ఆర్థిక లోటు లక్ష్యం ఊహించిన దానికంటే తక్కువగా ఉంది. పన్నుల విషయంలో కూడా పెద్దగా మార్పులు కనిపించలేదని ఆయన అన్నారు. చాలా కాలంగా ఆశించిన GDP నిష్పత్తికి పన్ను ఎక్కువ కావడం ద్వారా అవసరమైనప్పుడు ఇది వ్యయానికి బలమైన పునాదిని అందిస్తుందని ఆనంద్ మహీంద్రా అన్నారు.