- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mahakumbh 2025: ఒక్క రోజులో కోటి మంది "అమృత స్నాన్"
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా సమ్మెళనం మహాకుంభ మేళ.. జనవరి 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్(Prayag Raj)లో తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభం అయింది. చలికాలం కావడంతో .. విపరీతమైన చలి, దట్టమైన పొగమంచు కమ్ముకున్నప్పటికి.. లక్షలాది మంది భక్తులు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా "అమృత స్నాన్"("Amrita Snan") అని పిలిచే పవిత్ర స్నానం చేయడానికి మంగళవారం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమానికి(Triveni Sangam) తరలివచ్చారు. యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో త్రివేణి సంగమంలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు కోటి మంది భక్తులు(One crore devotees) పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ తెలిపింది.
2025 మహాకుంభమేళా(Mahakumbh Mela) మొదటి రోజు “ఐక్యత, వసుధైక కుటుంబం” అనే సందేశాన్ని ఇచ్చిందని రాష్ట్ర సమాచార శాఖ తెలిపింది. క్రౌడ్ అండ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, అండర్ వాటర్ మానిటరింగ్, ఫైర్ ఫైటింగ్ కోసం అన్ని ఆధునిక టెక్నాలజీలు, ఏఐ టూల్స్‌ను ఉపయోగించాలని ఆదేశాలు ఇచ్చామని ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. దాదాపు 40 రోజుల పాటు జరగనున్న ఈ కుంభమేళకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు హాజరై పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ కుంభమేళకు హాజరయ్యేందుకు గాను దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.