విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ: అమర్‌నాథ్‌కు అనుమానాలు

by srinivas |
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ:  అమర్‌నాథ్‌కు అనుమానాలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌(Visaka Steel Plant)కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ(Ycp) హయాంలో ప్రకటించకపోవడం, ప్రైవేటీకరణ చేయమని చెప్పకపోవడంపై మాజీ మంత్రి అమర్‌నాథ్(Former Minister Amarnath) అనుమానాలు వ్యక్తం చేశారు. స్టీల్ ప్రైవేటీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకించామని గుర్తు చేశారు. కానీ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయమని అప్పుడు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ వెనుకున్న మతలబేంటని నిలదీశారు. ప్రధాని మోడీ(Pm Modi) విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు ప్రకటన చేయలేదని అమర్‌నాథ్ ప్రశ్నించారు.

‘‘కేంద్రం ఇచ్చే ప్యాకేజీ అప్పులకే సరిపోతుంది. ప్లాంట్‌లో వీఆర్ఎస్ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారు. 25 వేల మందితో నడిచిన ప్లాంట్‌లో ఇప్పుడు కేవలం 10 మందితోనే నడుపుతున్నారు. ఇంకా ఉద్యోగాలు తొలగిస్తే ప్లాంట్ పరిస్థితేంటి.?. స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్. పన్నుల రూపంలో రూ. 55 వేల కోట్లు కట్టారు. ప్లాంట్‌కు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలి. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలి. సొంత గనులు కేటాయించాలి. రాష్ట్రపతి పేరు మీద ప్లాంట్ భూములను తిరిగి ప్లాంట్‌కే అప్పగించాలి.’’ అని అమర్ నాథ్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed