మెటా క్షమాపణలు చెప్పాల్సిందే!

by Johnkora |
మెటా క్షమాపణలు చెప్పాల్సిందే!
X

- జుకర్‌బర్గ్‌కు నోటీసులు పంపుతాం

- బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే

దిశ, నేషనల్ బ్యూరో:

కోవిడ్ పాండమిక్ తర్వాత ప్రపంచ దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడిపోయాయని, ఇండియాలో కూడా అదే జరిగిందంటూ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మండిపడ్డారు. కమ్యునికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి చైర్‌పర్స్‌న్ వ్యవహరిస్తున్న దూబే ఇటీవల జుకర్‌బర్గ్ ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలపై'ఎక్స్' వేదికగా స్పందించారు. 'తప్పుడు సమాచారం విషయంలో తమ కమిటీ మెటాకు సమన్లు జారీ చేస్తుది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరిగిన ఎన్నికల విషయంలో అబద్దాలు ప్రచారం చేయడం వల్ల దేశ ప్రతిష్టకు భంగం కలిగింది. మెటా చేసిన తప్పుకు భారత పార్లమెంట్‌తో పాటు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది' అని దూబే పేర్కొన్నారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ 2024లో ప్రపంచ దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార ప్రభుత్వాలన్నీ కుప్పకూలయని, అందులో ఇండియా కూడా ఉందని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. కరోన సమయంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారం పెట్టిందని, 2.2 బిలియన్ల ఫ్రీ వ్యాక్సిన్లు అందించిందని పేర్కొన్నారు. దీని వల్లే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం మరోసారి ఘన విజయం సాధించిందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed