అతనిపై యాక్షన్ తీసుకోవాలని ఇమ్రాన్ కన్నీళ్లు

by Mahesh |   ( Updated:2025-03-21 05:21:23.0  )
అతనిపై యాక్షన్ తీసుకోవాలని ఇమ్రాన్ కన్నీళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ (Betting Apps Promotions) చేసిన వారిపై కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం అయిన.. యూట్యూబర్ నా అన్వేష్ (YouTuber Na Anvesh)కు ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇన్ఫ్యూలెన్సర్ల (Influencers)కు సోషల్ మీడియా వార్ (Social media war) జరుగుతుంది. ఈ క్రమంలో నా అన్వేష్.. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అనే వ్యక్తిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే నా అన్వేషణ చేసిన వ్యాఖ్యలపై పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ (Pareshan Boys Imran Khan).. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో.. ఇమ్రాన్ మాట్లాడుతూ.. సీఎం సార్.. సోషల్ మీడియాలో లక్షల మంది ముందు నా తల్లి పై తప్పుడు ప్రచారం చేశారని.. తాన ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్స్ చేయడం లేదని వాపోయారు.

తన తండ్రి ప్రస్తుతం బతికే ఉన్నప్పటికి.. ఆయన చనిపోయాడని నా అన్వేష్ తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, తన ఛానల్ వ్యూస్ (Channel views) కోసం నా అన్వేషణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, తన కుటుంబ సభ్యులపై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని.. అతనిపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కోరుతూ ఇమ్రాన్ కన్నీళ్లు (Imran's tears) పెట్టుకున్నాడు. కాగా కొద్ది రోజుల క్రితం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ (Betting Apps Promotion) చేసిన వారిపై కేసులు నమోదు చేయగా అందులో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుతం దుబాయ్ పారిపోయినట్లు వార్తలు.. రాగా తాజాగా విడుదల చేసిన వీడియో ఆసక్తికరంగా మారింది.

Advertisement
Next Story

Most Viewed