Maha Kumbh 2025: మహా కుంభమేళతో కాసుల పంట.. రికార్డుల జోరు.. విమాన బుకింగ్స్‌ ఎంత పెరిగాయో తెలుసా?

by Vennela |
Maha Kumbh 2025:  మహా కుంభమేళతో కాసుల పంట.. రికార్డుల జోరు.. విమాన బుకింగ్స్‌ ఎంత పెరిగాయో తెలుసా?
X

Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌లోని 2025 మహా కుంభమేళా(Maha Kumbh 2025) ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా మారింది. 148 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ మహాకుంభాని(Maha Kumbh 2025)కి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ సమయంలో, ప్రజలు పవిత్ర సంగమంలో స్నానం చేయడానికి వస్తున్నారు, దీని కారణంగా నగరంలో విమానాలు, హోటళ్ళు, ఇతర ప్రయాణ సౌకర్యాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. మహాకుంభం కారణంగా ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో విమాన బుకింగ్‌లు 162 శాతం పెరిగాయి.

ixigo CEO అలోక్ బాజ్‌పాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్(Prayagraj) ఇప్పుడు డైరెక్ట్, వన్-హాప్ విమానాలతో 20 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు కనెక్ట్ చేశారు. వారణాసిచ లక్నో వంటి సమీప నగరాల విమానాశ్రయాలలో కూడా బుకింగ్‌లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కుంభమేళా (Maha Kumbh 2025)సందర్భంగా ముఖ్యంగా జనవరి 27న, ప్రధాన స్నానఘట్టం రోజున, అనేక ప్రధాన మెట్రోల నుండి ప్రయాగ్‌రాజ్‌Prayagraj)కి విమాన ఛార్జీలు(Airfare) రూ.27,000కి పెరిగాయి. రైలు బుకింగ్‌లో కూడా 187 శాతం పెరుగుదల ఉంది. రైలు బుకింగ్‌లలో 57 శాతం సోలో ట్రావెలర్‌(Solo traveler)లు చేస్తున్నారు, వీరిలో 39 శాతం మంది మహిళలు ఉన్నారని తెలిపారు.

మహాకుంభ సమయంలో వసతికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. 2,000 గుడారాల మినీ సిటీలో త్రివేణి సంగమం(Triveni Sangam) దగ్గర ఉండేందుకు భక్తులు ఇష్టపడతున్నారు. ఈ టెంట్ల ధర రాత్రికి రూ.12,500 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది. అల్టిమేట్ ట్రావెలింగ్ క్యాంప్‌(Ultimate Traveling Camp)లోని విలాసవంతమైన టెంట్లు వంటి కొన్ని ప్రీమియం టెంట్లు ఒక రాత్రికి రూ. 1 లక్ష ధరతో రాచరికపు స్నానపు(Royal bath) రోజులతో సహా కీలక తేదీల కోసం ఇప్పటికే పూర్తిగా బుక్ అయిపోయాయి.

విదేశాల నుంచి కూడా మహాకుంభానికి ఈ ఉత్సాహం కనిపిస్తోంది. ఈజీమైట్రిప్(EasyMyTrip) సీఈఓ రికాంత్ పిట్టి మాట్లాడుతూ మహా కుంభ్‌కు 1.5 నుంచి 2 కోట్ల మంది హాజరవుతారని, దీంతో వసతి.. ప్రయాణ ఎంపికలకు భారీ డిమాండ్ ఏర్పడిందని చెప్పారు.అయితే పవిత్ర స్నానం తేదీల కంటే ముందు ప్రయాణానికి ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. ముంబై వంటి కీలకమైన మెట్రో నగరాల నుంచి జనవరి 27న నాన్ స్టాప్ ఫ్లైట్స్ కు వన్ వే రూ. 27,000. ఫ్లాట్ ఫారమ్ కుంభం కోసం మైక్రో సైట్9Micro site) నుకూడా ప్రారంభించింది. దీనిలో ప్రయాణం, వసతి, సేఫ్టీ టిప్స్ తదితర వివరాలు ఉన్నాయి.

బెంగళూరు, జైపూర్, నాగ్ పూర్, కొచ్చి, ముంబై వంటి నగరాల నుంచి ప్రయాగ్ రాజ్ కు విమాన ఛార్జీలు గతేడాది ఇదే కాలంలో పోలిస్తే 3 రెట్లు పెరిగాయని క్లియర్ ట్రిప్ చీఫ్ బిజినెస్ అండ్ గ్రోత్ ఆఫీసర్ అనుజ్ రాఠీ తెలిపారు. మహాకుంభోత్సవం జనవరి 13 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.భక్తులకు, పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు. 45 రోజుల్లో సుమారు 40కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్ వస్తారని యోగి ప్రభుత్వం(Yogi government) అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ పర్యాటక రంగం(UP Tourism) మరింత వృద్ధి చెందనుంది.

Advertisement

Next Story

Most Viewed