- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Arvind Dharmapuri: మళ్లీ జైలుకు కవిత! ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: ‘బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారు.. మళ్లీ ఎప్పుడు వెళ్తారో తెలియదు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా జైలుకు వెళ్లే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి..’ అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Arvind Dharmapuri) హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్.. భూస్థాపితం కాబోయే సమితి అని, ఆ పార్టీ గురించి మాట్లాడటం వేస్ట్ అని విమర్శించారు. ఈ దేశాన్ని, తెలంగాణను కాంగ్రెస్, కేసీఆర్ పూర్తిగా బ్రష్టు పట్టించారని, తమ సొంత జాగీరు అని పరిపాలించాయని దుయ్యబట్టారు. ఇవాళ నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవంలో ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న అనంతరం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దృష్టి ఎంత సేపు రాజకీయాలు, అవినీతి, సంపాదనపై మాత్రమే ఉందని, అందువల్లే ఈ దేశం వెనుకబడిపోయిందని ఆరోపించారు. పసుపు బోర్డు చుట్టూ అనేక రాజకీయాలు జరిగాయని, పసుపు బోర్డు విషయంలో తనను అనేక రకాలుగా నన్ను టార్గెట్ చేశారన్నారు. పసుపు రైతుల ముసుగులో ఇండ్లపైకి, బండ్లపైకి గుండాలను పంపించారని గుర్తుచేశారు. ఫ్రమ్ బాండ్ టు బోర్డు వరకు ఇదో ప్రస్థానం అని అన్నారు.
గల్ఫ్ కార్మికులు తిరిగి వచ్చేందుకు మంచి చాన్స్
పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమేనని, ఈ దేశంలో 37 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక బోర్డు ఏర్పాటు జరిగిందని అర్వింద్ అన్నారు. పండగ రోజు ప్రధాని మోడీ బహుమతి ఇచ్చారని, పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకు కాకుండా ఇతర పంటలతో పాటు అక్కడ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు, పర్యాటకం, ప్యాకేజీ యూనిట్లు రాబోతున్నాయన్నారు. బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి, గల్ఫ్ కార్మికులు వెనక్కి తిరిగి వచ్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. పసుపు పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్‌కు రావడంలో ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పీయూష్ గోయల్ కృషి చాలా ఉందన్నారు. పసుపు పంటలపై అన్ని అంశాల్లో అవగాహన ఉన్న పల్లె గంగారెడ్డి పసుపు బోర్డు చైర్మన్‌గా నియామకం కావడం సంతోషకరమన్నారు.
ఆ మంత్రికి వయసు పెరిగిన చిలిపి చేష్టలు పోలేదు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వయసు పెరిగినా చిలిపి చేష్టలు పోలేవని అర్వింద్ విమర్శించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఆయనకైనా తెలుసా..? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడం వల్లే పసుపు బోర్డు కార్యాలయం తెలంగాణలో సాకారమైందని మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. చేతనైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన చెరుకు ఫ్యాక్టరీలను తుమ్మల తెరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి తుమ్మల, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మినీ కేసీఆర్‌లని ధ్వజమెత్తారు. వీరు కేవలం సొంత ఫామ్హౌస్ల్లోనే వ్యవసాయం చేస్తారని, ఇతర భూముల్లో చేయరని, రైతులను పట్టించుకోరని దుయ్యబట్టారు.