Ram Charan: అభిమానులకు హామీ ఇస్తున్నా.. పండగ పూట రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

by Hamsa |
Ram Charan: అభిమానులకు హామీ ఇస్తున్నా.. పండగ పూట రామ్ చరణ్ ఎమోషనల్ నోట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్‌(Game Changer)లో మేము పడిన శ్రమ నిజంగా విలువైనదిగా చేసినందుకు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. సినిమా విజయానికి సహకరించిన మొత్తం నటీనటులకు, సిబ్బందికి తెరవెనుక ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. మీ అచంచలమైన ప్రేమ, మద్దతు ఇవే నాకు ప్రపంచం.

ఈ మైలురాయిలో కీలక పాత్ర పోషించిన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. 2025ను సానుకూలతతో స్వాగతిస్తున్నా.. మీరు గర్వపడేలా చేస్తాను. ఇక నుంచి అద్భుతమైన ఫెర్ఫామెన్స్(Performance) ఇవ్వడం కొనసాగిస్తానని హామీ ఇస్తున్నాను. గేమ్ చేంజర్(Game Changer) ఎల్లప్పుడూ నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అభిమానులు చూపించే ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శంకర్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed