BCCI: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-18 10:43:00.0  )
BCCI: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)కి బీసీసీఐ(BCCI) భారత జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన టీమ్‌ను శనివారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా బీసీసీఐ వెల్లడించింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కూ ఇదే జట్టు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. అనంతరం ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్(India-Pakistan) మధ్య మ్యాచ్ జరుగనుంది. గ్రూప్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడనుంది.

ఫిబ్రవరి 20 బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాక్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా దుబాయ్‌ వేదికగా తలపడనుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఐసీసీ టోర్నీ జరగబోతోంది. దాయాది దేశం పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇస్తోంది. భారత్ ఆడే మ్యాచ్‌లు యూఏఈలోనూ జరగనున్నాయి. చివరిసారిగా టీమ్‌ఇండియా 2013లో ధోనీ నాయకత్వంలో విజేతగా నిలిచింది. మ్యాచ్‌ల నిర్వహణ మొత్తం హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించానున్నారు.

జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, జస్ప్త్రీత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.




Next Story

Most Viewed