త్వరలో పోలీస్ ల ఆధీనంలోని వాహనాలకు బహిరంగ వేలం

by Sridhar Babu |
త్వరలో పోలీస్ ల ఆధీనంలోని వాహనాలకు బహిరంగ వేలం
X

దిశ, ఆదిలాబాద్ : వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను బహిరంగ వేలంకు జిల్లా న్యాయస్థానం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సన్నాహాలు చేస్తున్నట్లు మంగళవారం జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. కాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులు ఆరు నెలల్లోగా సంబంధిత వాహన ధ్రువపత్రాలు చూపించి తిరిగి పొందడానికి అవకాశం కల్పించామని పేర్కొన్నారు. జిల్లాలోని 21 పోలీస్ స్టేషన్ లలో వివిధ నేరాలకు సంబంధించినవి, దొరికిన ఆయా కేసుల్లో స్వాధీనం చేసుకున్న వివిధ రకాలైన 73 వాహనాలకు త్వరలో బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన నెంబర్లు, ఇంజన్ నెంబర్లు, సంబంధిత పోలీస్ స్టేషన్ లు తెలుసుకోవడానికి జిల్లా పోలీస్ అధికారిక ట్విట్టర్ ఖాత, ఫేస్ బుక్, ఇన్​స్ట్రాగ్రామ్​లో పొందుపరిచినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం అదనపు ఎస్పీ కార్యాలయం లేదా, రిజర్వ్ ఇన్స్పెక్టర్ టి. మురళి 8712659962 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed