- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్ని మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచిన హీరో మోటోకార్ప్!
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న ఫేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా పెరిగిన ఉత్పత్తి వ్యయ భారాన్ని తగ్గించేందుకు హీరో మోటోకార్ప్ ధరలను పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని మోడల్‌ని బట్టి దాదాపు 2 శాతం మేర ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. దీంతో కంపెనీ ఎంపిక చేసిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్‌షోరూమ్ ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. నిర్దిష్ట మోడల్, దేశంలోని ప్రాంతాన్ని బట్టి ధరల పెరుగుదలలో వ్యత్యాసం ఉంటుంది.
హీరో మోటోకార్ప్ వినియోగదారులపై ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పటికే వివిధ ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందిస్తోంది. దీన్ని కొనసాగిస్తామని, అయినప్పటికీ దేశీయ వాహన పరిశ్రమలో అన్ని వాహనాలను బీఎస్ 6 రెండో దశకు అనుగుణంగా మార్చేందుకు ఎక్కువ ఖర్చు అవుతోంది. అందుకే తప్పనిసరిగా వినియోగదారులకు ధరల భారాన్ని బదిలీ చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.