- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టిష్యూకు బదులు కరెన్సీ నోట్లు వాడిన అంబానీ.. ట్వీట్ వైరల్..!
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచంలోనే అపర కుబేరుల్లో ఒకరనే విషయం తెలిసిందే. ప్రపంచంలో రెండో ఖరీదు అయిన ఇంట్లో (యాంటిలియో భవనం) ఎంతో విలాసవంతమైన లైఫ్‌ను అంబానీ గడుపుతున్నారు. అయితే వారి ఇంట్లో ఏ కార్యక్రమాలు జరిగినా వార్తలో అది ముఖ్య హెడ్‌లైన్‌గా నిలుస్తుంది. అలాగే వారి పార్టీ గురించి ఏ ఫొటో బయటకు వచ్చినా, ఎలాంటి విషయాలు వచ్చినా కచ్చితంగా దానిపై చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా అలాంటిదే ఓ ఆసక్తికరమైన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ‘‘అంబానీ ఇంట్లో విందు జరిగితే అక్కడ ఫుడ్‌తో టిష్యూ పేపర్లకు బదులు.. కరెన్సీ నోట్లు ఇస్తారని’’ సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఓ ఫుడ్ ఐటమ్ పిక్‌ను రతనిశ్ అనే ఓ ట్విటర్ యూజర్ ట్వీటర్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఐటమ్స్‌తో పాటు కరెన్సీ నోట్లు పెట్టి కనిపించాయి. రతనీశ్ ఆ ఫొటో కింద.. అంబానీ పార్టీలో ఫుడ్ ఐటమ్‌తో టిష్యూ పేపర్‌కు బదులు రూ. 500 నోట్లు ఉంటాయని క్యాప్షన్ పెట్టాడు.
ఇది చూసిన నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. చాలా మంది ఆ విధానం తప్పని వాదిస్తుండగా.. ఇంకొందరేమో ‘ నిజంగా అంబానీ వాళ్ల పార్టీలో టిష్యూ పేపర్లకు బదులు కరెన్సీ నోట్లను బంధువులకు ఇచ్చారా..? అంటూ అతడికి సమాధానం ఇచ్చారు. ఆ ఫొటోను చూస్తే అది వాస్తవం కాదని దిల్లీ వాస్తవ్యూలకు తొందరగానే అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఓ రిచ్ డైనింగ్ అందించే భారతీయుడు అస్సెంట్ అనే రెస్టారెంట్‌లో అందించే డిష్ అది. ఈ డిష్ పేరు దౌలత్ కీ చాట్. ఈ డిష్‌నే అంబానీ పార్టీలో సర్వ్ చేసి ఉండొచ్చు. ఆ రెస్టారెంట్‌లో దౌలత్‌కీ చాట్ అనే డిజర్ట్ అందిస్తున్నది. దీన్ని ‘‘డిజర్ట్ ఆఫ్ ది రిచెస్’’ అని కూడా పిలుస్తారు. ఈ డిజర్ట్ అందించే కప్‌లో ఫేక్ కరెన్సీ నోట్లనూ పెట్టి రిచ్‌గా డెకరెట్ చేస్తారు. కాబట్టి డిజర్ట్‌తో కనిపిస్తున్నవి నిజమైన కరెన్సీ నోట్లు కావు. అవి ఫేక్ కరెన్సీ నోట్లు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read..