- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఎన్నికల తర్వాత రీచార్జ్ ధరల పెంపు!
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దిగ్గజ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నికల తర్వాత జులై నుండి అక్టోబర్ వరకు మధ్య టారీఫ్ ధరలను దాదాపు 15-17 శాతం వరకు పెంచనుందని వారు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ ఆర్పూ ఆదాయం రూ. 208గా ఉంది. రీచార్జ్ ధరలు పెంచినట్లయితే 2027 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ ఆర్పూ 286 రూపాయలకు పెంచుకోగులుగుతుంది. గతంలో కూడా ఎయిర్‌టెల్ తన ఆర్పూను రూ.300కి పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొనగా, ఎన్నికలు పూర్తయ్యాక దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
2016లో జియో తన సర్వీస్‌ను ప్రారంభించిన తర్వాత ఎయిర్‌టెల్ డిసెంబర్ 2019లో మొదటగా 20-40 శాతం టారిఫ్ పెంపుదల చేసింది, ఆ తర్వాత చివరిసారిగా డిసెంబర్ 2021లో 20 శాతం ధరల పెంపుదల చేసింది. ఎయిర్‌టెల్ నాలుగు త్రైమాసికాలలో వరుసగా రూ.30- 36 ఆర్పూను పెంచుకుంది. ఎన్నికల అనంతరం రీచార్జ్ ధరల పెంపుదల ప్రకటించబడుతుందని, 15 శాతానికి పైగా పెరిగే చాన్స్ ఉందని బెర్న్‌స్టెయిన్‌లోని విశ్లేషకులు ఇటీవలి నోట్‌లో తెలిపారు.
గతంతో పోలిస్తే వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా 37.2 శాతం నుంచి సగానికి పడిపోయి 19.3 శాతానికి చేరుకుంది. అదే సమయంలో ఎయిర్‌టెల్ 29.4 శాతం నుంచి 33 శాతానికి పెరిగింది. మరో దిగ్గజ కంపెనీ జియో మార్కెట్ వాటా 21.6 శాతం నుంచి 39.7 శాతానికి పెంచుకుని అతిపెద్ద లాభదాయకమైన టెలికాం కంపెనీగా నిలిచింది.