- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AI: స్వతంత్రంగా పనిచేసే 'మానస్ ఏఐ'

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ ఏఐ రంగంలో డీప్‌సీక్‌తో సంచలనం రేపిన డ్రాగన్ కంట్రీ మరో అద్భుతాన్ని సృష్టించింది. కొన్ని వారాల క్రితం డీప్‌సీక్ ఏఐతో అమెరికా మార్కెట్లను వణికించిన చైనా, తాజాగా 'మానస్ ఏఐ' పేరుతో మోనికా అనే స్టార్టప్ కంపెనీ కొత్త ఏఐ ఎజెంట్‌ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న ఏఐ చాట్‌బాట్‌లతో పోలిస్తే మానస్ ఏఐ ఏజెంట్ అత్యంత మెరుగైన ఏజెంట్ మోడల్ అని కంపెనీ చెబుతోంది. ఇది ఒకే సమయంలో అనేక పనులను చేయగలదు. ముఖ్యంగా ఇప్పటివరకు ఏఐ రంగంలో కీలకంగా ఉన్న ఓపెన్ఏఐ, గూగుల్‌కు చెందిన జెమినై, ఆంత్రోపిక్‌లతో కలిసి పనిచేయగలదు. దీన్ని ఉపయోగించిన కొందరు మానస్ ఏఐ మనుషుల పర్యవేక్షణ లేకుండా స్వతంత్రంగా పనిచేస్తోందని, ఇది ఇప్పటివరకు వరకు ఉన్న చాట్‌బాట్‌ల కంటే మెరుగ్గా ఉందన్నారు.
మానస్ గురించి..
మానస్‌ను అభివృద్ధి చేసిన చైనీస్ స్టార్టప్ మోనికా, ఈ కొత్త ఏఐ ఏజెంట్‌ను ఒక ప్లాట్‌ఫామ్‌గా అందరికీ పరిచయం చేసింది. తమ ఏఐ ఏజెంట్ కేవలం ఇచ్చిన టాస్క్ గురించి సమాచారం ఇవ్వడమే కాకుండా, అదనపు వివరాలను ఇతర ఏఐ చాట్‌బాట్‌ల నుంచి సేకరించి సమగ్ర వివరాలను అందిస్తుంది. డెవలపర్‌ల ప్రకారం, ఈ కొత్త ఏఐ ఏజెంట్ అనేక రకాల పనులను స్వయంగా ఆలోచించి చేయగలదు. ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు ప్లాన్ చేయడమే కాకుండా, అమలు విధానాన్ని కూడా చూసుకుంటాయి. కొత్త వెబ్‌సైట్‌లను రూపొందించడం దగ్గరి నుంచి ట్రావెల్ ప్లాన్, స్టాక్‌ల విశ్లేషణ వరకు మానస్ అన్ని పనులను కేవలం ఒక ప్రాంప్ట్ ద్వారా పూర్తి చేయగలదు. ఇప్పటివరకు ఉన్న చాట్‌జీపీటీ, డీప్‌సీక్, జెమినై వంటివి అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇచ్చాయి. ఇవి మనం అడిగిన వాటి గురించి మాత్రమే చెబుతాయి, అది కూడా మనుషులు ఇచ్చే ప్రాంప్ట్ ఆధారంగా సూచనలను పాటిస్తాయి. స్వతంత్రంగా పనిచేయవు.
ఏఐ శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ స్వతంత్రంగా పనిచేయగలిగిన ఏఐ ఏజెంట్లను రూపొందించలేదు. అమెరికాలోని కంపెనీలు సైతం అటువంటి ఏఐ ఏజెంట్ల విషయంలో ఇంకా ప్రణాళిక దశలోనే ఉన్నాయి. కానీ, చైనా స్టార్టప్ కంపెనీ మోనికా పూర్తిస్థాయిలో స్వతంత్రంగా పనిచేసేలా మానస్ ఏఐను రూపొందించింది. మనుషులతో పనిలేకుండా, పర్యవేక్షణ, సూచనలు లేకుండా ఖచ్చితత్వంతో పనులను చక్కబెట్టేస్తోంది. ఉదాహరణకు, ఏదైనా ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌ల గురించి సమాచారం గురించి మానస్ ఏఐకు ప్రాంప్ట్ ఇస్తే.. వాటి జాబితాను సేకరించడమే కాకుండా, మరో ప్రాంప్ట్ అవసరం లేకుండానే ఖాళీ అపార్ట్‌మెంట్లు ఉన్న ప్రాంత గురించి, అక్కడి వాతావరణం, అద్దె వివరాలే కాకుండా ఆ ప్రాంతంలో జరిగే నేరాల శాతం, ప్రాంప్ట్ ఇచ్చిన యూజర్ అభిరుచికి తగినట్టు అపార్ట్‌మెంట్లను సూచిస్తుంది.
ఎలా పనిచేస్తుందంటే..
మానస్ ఏఐ ఏజెంట్‌ను ఇతర ఏఐ చాట్‌బాట్‌ల తరహాలో కాకుండా మరింత సమర్థవంతంగా పనిచేసేలా రూపొందించారు. ఇతర ఏఐ చాట్‌బాట్‌లు న్యూరాల్ నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తే, మానస్ ఏఐ మల్టీ ఏజెంట్ ఆర్కిటెక్చర్‌పై పనిచేస్తుంది. దీనర్థం, ఇతర ఏఐ చాట్‌బాట్‌లకు స్వంతంగా సమాచారం ఇచ్చి అవసరమైన వివరాలను సేకరించగలిగే మేనేజర్‌గా పనిచేస్తుంది. మానస్ ఏఐకు ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే, అందులో కావాల్సిన వివరాల కోసం చిన్న చిన్న భాగాలుగా విడదీసి ఇతర ఏజెంట్లకు పంపిస్తుంది. అనంతరం ఆ ప్రాంప్ట్ పురోగతిని పర్యవేక్షిస్తుంది. పూర్తిస్థాయిలో క్లౌడ్ ఆధారంగా స్వయంగా అన్ని పనులు చేసే సామర్థ్యం ఉన్న కారణంగా మానస్ ఏఐ ప్రస్తుతం ఏఐ వరల్డ్‌లో సంచలనంగా మారింది.