ఈ ఏడాది కాల్ డ్రాప్ సమస్యను ఎదుర్కొన్న 89 శాతం మంది కస్టమర్లు

by S Gopi |
ఈ ఏడాది కాల్ డ్రాప్ సమస్యను ఎదుర్కొన్న 89 శాతం మంది కస్టమర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా కాల్‌ కనెక్ట్‌ అవ్వడంలో ఇబ్బందులు, మాట్లాడుతుండగా కాల్‌ కట్‌ అవుతోందని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగాయి. 2024లో ఇప్పటివరకు 89 శాతం మంది కాల్ డ్రాప్ సమస్యలను ఎదుర్కొన్నట్టు తాజాగా ఓ నివేదిక తెలిపింది. వారిలో మొత్తం 38 శాతం మంది 20 శాతం లేదా ఇంకా ఎక్కువ కాల్స్‌ను డిస్‌కనెక్ట్ అవుతోందని చెప్పారు. దేశంలోని 362 జిల్లాల నుంచి ఆన్‌లైన్‌ సర్వే సంస్థ లోకల్‌ సర్కిల్స్‌ సేకరించిన వివరాల ప్రకారం, గత 12 నెలలుగా మొబైల్ సబ్‌స్క్రైబర్ల నుంచి కాల్ డ్రాప్ ఫిర్యాదులు అందుతున్నాయి. 41 శాతం మంది 0-30 సెకన్ల లోపే కాల్ డ్రాప్ అవుతోందని, 27 శాతం మంది 30-60 సెకన్లలోపు, 27 శాతం మంది ఒక నిమిషం లేదా అంతకంటే ఎక్కువ సమయం తర్వాత కాల్స్ డ్రాప్ అవుతున్నాయని చెప్పారు. అంతేకాకుండా ప్రతి ముగ్గురిలో ఒకరు కాల్ కనెక్టివిటీ, డ్రాప్ వంటి సమస్యల కారణంగా ఇతర ఆన్‌లైన్ యాప్‌ల నుంచి వైఫై కాల్స్ చేస్తున్నట్టు చెప్పారు. గత 2 ఏళ్లలో ఈ ధోరణి గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story