- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధిక వడ్డీతో ఎస్‌బీఐ కొత్త ఎఫ్‌డీ పథకం!
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వినియోగదారుల కోసం సరికొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరిమిత కాలానికి అందుబాటులో ఉండే ఈ స్కీమ్‌ను భారత్ స్వాతంత్ర సాధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 'ఉత్సవ్ డిపాజిట్' పేరుతో దీన్ని ప్రవేశపెట్టింది.
ఆగష్టు 15 నుంచి అందుబాటులోకి వచ్చే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) 75 రోజుల్లోగా తీసుకోవాలని, దీనికి ప్రత్యేక వడ్డీ అందిస్తున్నట్టు ఎస్‌బీఐ పేర్కొంది. నిర్దేశించిన గడువు తర్వాత ఈ ఎఫ్‌డీ పథకం అందుబాటులో ఉండదని, దీని తర్వాత పాత వడ్డీ రేట్లు అమలవుతాయని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ ఉత్సవ్ డిపాజిట్ పేరుతో తెచ్చిన ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులకు సాధారణ వడ్డీ కంటే ఎక్కువ వడ్డీని అందించనుంది. ఇందులో ఎఫ్‌డీ చేసిన వారికి 6.10 శాతం వార్షిక వడ్డీ ఉంటుందని, ఈ స్కీమ్ 1000 రోజుల(మూడేళ్ల కంటే తక్కువ) కాలవ్యవధి కలిగి ఉంటుందని బ్యాంకు వివరించింది. మూడేళ్ల పాటు ఎఫ్‌డీ చేయాలని భావించేవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, సీనియర్ సిటిజన్లకు ఎప్పటిలాగే అదనంగా 0.50 శాతం ఎక్కువ 6.60 శాతం వడ్డీ వర్తిస్తుందని బ్యాంకు వెల్లడించింది.