ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య భారత్‌లోకి 2,000 కిలోల బంగారం స్మగ్లింగ్!

by Harish |   ( Updated:2023-10-25 12:59:22.0  )
ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య భారత్‌లోకి 2,000 కిలోల బంగారం స్మగ్లింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోకి ఇటీవల కాలంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం భారీగా పెరుగుతుంది. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా భారత్‌లోకి స్మగ్లింగ్ చేస్తున్న 2,000 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) చైర్మన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గత ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో 1,400 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకోగా, 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3,800 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. ఇది ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన 43 శాతం పెరిగింది. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరల బట్టి స్మగ్లింగ్ పెరుగుతుంటుందని CBIC చైర్మన్ అన్నారు.

బంగారం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బంగారంపై 12.5 శాతం కస్టమ్స్ డ్యూటీ, AIDC 2.5 శాతం, IGST 3 శాతం ఉన్నాయి. దీంతో మొత్తంగా బంగారంపై పన్ను రేటు 18.45 శాతంగా ఉంది.

Advertisement

Next Story