తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు బంద్​

by srinivas |
Buses from Telangana to AP closed
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి వెళ్లే బస్సులను టీఎస్‌ ఆర్టీసీ నిలిపివేసింది. ఏపీలో కర్ఫ్యూ దృష్ట్యా తాత్కాలికంగా తెలంగాణ బస్సులను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్​శర్మ గురువారం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ మధ్య మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్న వాహనాలకు అనుమతినిచ్చినట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిబంధనలు వర్తించనున్నాయని తెలిపారు.

బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లే 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ముందస్తు రిజర్వేషన్‌లను కూడా అధికారులు రద్దు చేశారు. అంతేకాకుండా మన రాష్ట్రం నుంచి ఏపీ మీదుగా వెళ్లే ఇతర రాష్ట్ర సర్వీసులను కూడా నిలిపివేసింది. ఆర్టీసీతో పాటుగా పలు ప్రైవేట్​ సర్వీసులకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచి వెళ్లే బస్సులు మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

బుధవారం నుంచే కొన్ని ఆర్టీసీ బస్సులను నిలిపివేసినా… ప్రైవేట్​ బస్సులు యథాతధంగా నడిచాయి. కానీ ఇప్పుడు వాటిని కూడా రద్దు చేసేందుకే నిర్ణయం తీసుకున్నారు. కొన్ని సర్వీసులు ఇప్పటికే బుకింగ్​ స్వీకరించాయి. వాటిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రవాణా శాఖ అధికారులు కూడా ప్రైవేట్​ సర్వీసులకు నోటీసులిచ్చారు. సర్వీసులను నిలిపివేయాలని, రిజర్వేషన్లు రద్దు చేసి వారికి నగదును చెల్లించాలని సూచించారు.

Advertisement

Next Story