- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫిట్‌నెస్ సెంటర్లు తెరుచుకునేదెన్నడూ?
కారోనా దెబ్బకు ప్రతి రంగమూ కూదేలైంది. లాక్‌డౌన్ కారణంగా చిన్న, మధ్య తరగతి వారిపై ప్రభావం ఎక్కువగానే పడింది. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం.. సడలింపులతో పలు నిర్వహణలకు అనుమతినిచ్చింది. కానీ జిమ్ సెంటర్లు, సినిమా థియేటర్లు తెరిచేందుకు ఇంకా ఓకే చెప్పలేదు. దీంతో వీటి నిర్వాహకులపై రోజురోజుకూ భారం పెరుగుతోంది. ఆరోగ్యం, వ్యాయామం కోసం ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల ఫిట్ నెస్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇవి సుమారు మూడు నెలలుగా తెరుచుకోవడం లేదు. ఫలితంగా అందులో పనిచేసే వారికి, శిక్షణ ఇచ్చే వారికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కొన్నేండ్లుగా ఫిట్ నెస్ పై యువతకు మక్కువ పెరిగింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని పట్టణ కేంద్రాలతో పాటు నియోజకవర్గ స్థాయిలలోనూ చిన్న చిన్న ఫిట్‌నెస్ సెంటర్లు వెలిసాయి. లాక్ డౌన్ కారణంగా అవి మూత పడ్డాయి. వివిధ రకాల సడలింపులతో అనేక వ్యాపారాలకు అనుమతులు ఇచిన ప్రభుత్వం ఫిట్ నెస్ సెంటర్లకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. సుమారు 3 నెలలుగా ఫిట్‌నెస్ సెంటర్లు తెరుచుకోవడం లేదు. నిర్వాహణ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నవారిని నియమించి వారికి ఎక్కువ మొత్తంలోనే జీతెం చెల్లించాల్సి ఉండటంతో ఆ భారాన్ని నిర్వాహకులు మోయలేకపోతున్నారు.
నెలకు సుమారు రూ.70 వేల ఖర్చు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆయా ప్రాంతాల్లో దుకాణాల అద్దెలు అమాంతంగా పెరిగిపోయాయి. ఒక్కో ఫిట్ నెస్ సెంటర్ కిరాయి సుమారు రూ.20వేల నుంచి రూ.35వేల వరకు ఉంది. వీటితో పాటు శిక్షణ ఇచ్చే వారి వేతనాలు, మెయింటనెన్స్ అంతా కలిపి నెలకు సుమారు రూ.60 నుంచి రూ.70వేల వరకు ఖర్చు అవుతుంది. పోటీ కూడా భారీగా పెరగడంతో వచ్చే కస్టమర్ల సంఖ్య సైతం అరకొరగానే ఉంటుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 20 ఫిట్‌నెస్ సెంటర్లు వుండగా వనపర్తిలో 9, నాగర్ కర్నూల్ లో 10, గద్వాలలో 12, నారాయణపేటలో సుమారు 6 కేంద్రాలు ఉన్నాయి.
వడ్డీ కట్టలేక..
చాలా మంది రూ.లక్షలు అప్పు చేసి ఫిట్ నెస్ కేంద్రాలను ప్రారంభించారు. సుమారు 3 నెలలుగా ఫిట్‌నెస్ సెంటర్లు పూర్తిగా మూతపడటంతో ఫిట్ నెస్ కోసం వచ్చే వారు ఫీజులు చెల్లించడం లేదు. దీంతో తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేక నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఇటు అద్దె కట్టెలేక.. అటు వడ్డీ చెల్లించలేక సతమతవుతున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వివిధ వ్యాపారస్థులకు పలు షరతులతో కూడిన సడలింపులు ఇచ్చినట్టుగానే తమకు సైతం నిబంధనలతో అనుమతి ఇస్తే బాగుంటుందని ఫిట్ నెస్ సెంటర్ యజమానాలు కోరుతున్నారు. దీనితో తమపైన పడుతున్న భారం కొంతైనా తగ్గుతుందని చెబుతున్నారు.