- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్రీడా బడ్జెట్‌లో 8.16 శాతం కోత
దిశ, స్పోర్ట్స్ : కేంద్ర బడ్జెట్ 2021-22ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది క్రీడారంగానికి పెద్దగా కేటాయింపులు చేయలేదు. పైగా కొన్ని విభాగాలకు బడ్జెట్ తగ్గించారు. అయితే జాతీయ క్రీడా ఫెడరేషన్లకు ఇచ్చే గ్రాంట్‌ను పెంచారు. త్వరలో ఒలింపిక్స్ జరుగనుండటంతో కాస్త గ్రాంట్‌ను పెంచడం ద్వారా శిక్షణ కార్యక్రమాలకు అవసరమైన నిధులు ఫెడరేషన్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా విజయాలను ప్రస్తావించారు.
ఇవీ కేటాయింపులు.. కోతలు
కేంద్ర ప్రభుత్వం క్రీడా బడ్జెట్‌ను మొత్తానికి 8.16 శాతం మేర కోత పెట్టింది. అయితే త్వరలో ఒలింపిక్స్ జరగనుండటంతో జాతీయ క్రీడా ఫెడరేషన్లకు మాత్రం బడ్జెట్‌ను 14.28 శాతం మేర పెంచింది. గత ఏడాది రూ. 245 కోట్లు ఫెడరేషన్లకు కేటాయించగా.. ఈ ఏడాది రూ. 280 కోట్లకు పెంచారు. అంటే రూ. 35 కోట్లు అదనంగా ఫెడరేషన్లకు దక్కనున్నాయి. ఈ నిధులు క్రీడాభివృద్దికి, గ్రామీణ ప్రాంతంలో జరిగే క్రీడల్లో పాల్గొనే వారి సంఖ్య పెంచడానికి వాడాలని సూచించారు.
మరోవైపు క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కొన్ని కార్యక్రమాల నిధులను భారీగా తగ్గించింది. క్రీడాకారులకు వివిధ అవార్డులు, పథకాల ద్వారా ఇచ్చే ప్రోత్సాహకాలను తగ్గించింది. దీంతో పాటు జాతీయ క్రీడాభివృద్ది నిధిని కూడా తగ్గించేసింది. మొత్తంగా గత ఏడాది వీటికి సంబంధించి రూ. 1015.42 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది కేవలం రూ. 737.71 కోట్లకు తగ్గించింది. అంటే గత ఏడాది కంటే రూ. 277 కోట్లు తక్కువ. కాగా, సెంట్రల్ సెక్టార్ కింద కేటాయించే నిధులను స్వల్పంగా పెంచింది. గత ఏడాది రూ. 1047 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది వాటిని రూ. 1162.13 కోట్లకు పెంచింది. మొత్తానికి క్రీడారంగానికి ఈ బడ్జెట్‌లో నిరాశ తప్పలేదని భావించవచ్చు.
టీమ్ ఇండియా స్ఫూర్తి
కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా టీమ్ ఇండియా పోరాటాన్ని కొనియాడారు. ‘క్రికెట్‌ను మన దేశంలో ఎంతగానో అభిమానిస్తాము. ఇటీవల ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత మనం ఎలాంటి అనుభూతిని పొందామో తెలిసిందే. ఈ విజయం ప్రజలు, అభిమానులకే కాకుండా యువతలో ఎంతో స్పూర్తిని నింపింది. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా నిరాశ చెందక ముందుకు సాగిపోవాలనే విషయాన్ని వారి పోరాటం తెలియజేసింది. ఓటములు ఎదురైనా అత్యుత్తమ ప్రదర్శన చేసి గెలవాలన్న కసిని, స్పూర్తిని రగిలించింది’ అని ప్రసంగంలో పేర్కొన్నారు. కాగా, ఇటీవల టీమ్ ఇండియా గెలుపు తర్వాత దేశ ప్రధాని మోడీ నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు ఏదో ఒక సందర్భంలో ప్రస్తావిస్తున్నారు. రెండో రోజుల క్రితం మన్ కీ బాత్‌లో ప్రధాని ప్రశంసించారు. ఇప్పుడు ఏకంగా పార్లమెంటులో ఆర్థిక మంత్రి ప్రస్తావించడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.