యూపీ, ఉత్తరాఖండ్‌లో బీఎస్పీ సోలో ఫైట్

by Shamantha N |
యూపీ, ఉత్తరాఖండ్‌లో బీఎస్పీ సోలో ఫైట్
X

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఎన్నికలకు ముందు బీఎస్‌పీ ఎలాంటి పొత్తులు పెట్టుకోవడం లేదని పార్టీ చీఫ్ మాయావతి క్లారిటీనిచ్చారు. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేసింది. ఏఐఎంఐఎం పార్టీతో పొత్తుపెట్టుకున్నట్టు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ, ఏఐఎంఐఎంతో కలిసి పోటీ చేస్తున్నదని ఓ న్యూస్ చానెల్ పదేపదే ప్రసారం చేస్తు్న్నదని ఆమె ట్వీట్ చేశారు. ఆ వార్త పచ్చి అబద్ధమని, అర్థరహితమని, తప్పుదారి పట్టిస్తున్నదని పేర్కొన్నారు. అందులో వీసమెత్తు నిజం లేదని వివరించారు. ఇలాంటి వార్తలను బీఎస్‌పీ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. యూపీలో ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఎస్‌పీ ఘోరమైన ప్రదర్శన కనబరించింది. బీజేపీ, ఎస్‌పీల తర్వాత మూడో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే పొత్తు గురించిన వార్తలు రావడంపై ఆమె ఖండించారు. కాగా, పంజాబ్‌లో మాత్రం శిరోమణి అకాలీ దళ్‌తో పార్టీ పొట్టు పెట్టుకున్నది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ రెండు పార్టీల మళ్లీ చేతులు కలపడం గమనార్హం.

యూపీలో 100 సీట్లలో పోటీ చేస్తాం: అసదుద్దీన్ ఒవైసీ

వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పార్టీ 100 సీట్లలో పోటీ చేస్తుందని పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఇందుకోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని వివరించారు. ఓంప్రకాశ్ రాజ్‌బర్‌కు చెందిన భాగీదారీ సంకల్ప్ మోర్చా కూటమిలో భాగమై ఉన్నామని తెలిపారు. ఇది మినహా ఇతర పార్టీలో ఎన్నికలు, పొత్తుల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఎంఐఎంతో తమకు పొత్తు లేదని మాయావతి ట్వీట్ చేసిన తర్వాత ఒవైసీ స్పందించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed