మార్కెట్ల భారీ పతనం.. నిలిచిపోయిన ట్రేడింగ్

by Shamantha N |

దేశీయ మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. మన దేశంలో కూడా ఆదివారం లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ ప్రభావం సోమవారం దేశీయ మార్కెట్లు ప్రారంభం కాగానే కనిపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 3,594.08 పాయింట్లు పతనమై 26,321.88కు చేరుకుంది. దీంతో ట్రేడింగ్‌ను నిలిపివేశారు. ఈ స్థాయిలో బీఎస్‌ఈ పడిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. దాదాపు 10 శాతం వరకు ముదుపర్ల సంపద ఆవిరైపోయింది. నిఫ్టీ కూడా భారీ నష్టాలను చవిచూసింది. 842 పాయింట్లు పతనమై 7,903కు చేరుకుంది. వరుస నష్టాల నేపథ్యంలో దేశీయ మార్కెట్ల ట్రేడింగ్‌ను పూర్తిగా నిలిపివేయాలని డిమాండు ఊపందుకుంది.

Advertisement

Next Story

Most Viewed