ఇండియ‌న్ ఆర్మీలో బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సు

by Harish |   ( Updated:2021-02-22 09:40:16.0  )
Indian Army
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియ‌న్ ఆర్మీ ప్ర‌తి ఏడాది నిర్వ‌హించే మిలిట‌రీ న‌ర్సింగ్ స‌ర్వీస్ నాలుగేళ్ల బీఎస్సీ(న‌ర్సింగ్‌-2021) కోర్సులో ప్ర‌వేశాల కోసం అర్హులైన మ‌హిళా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది.
కోర్సు పూర్తిచేసిన వారికి మిలిట‌రీ న‌ర్సింగ్ స‌ర్వీస్‌లో ప‌ర్మినెంట్‌/ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్‌లో ఉద్యోగం క‌ల్పిస్తారు.
కోర్స్ పేరు: బీఎస్సీ(నర్సింగ్‌) కోర్సు-2021
మొత్తం సీట్లు: 220
న్యూఢిల్లీ, పుణె, కోల్‌కతా, అస్విని, లక్నో మరియు బెంగళూరుల్లో 6 నర్సింగ్ కళాశాలలు ఉంటాయి. అన్ని కళాశాలల్లో 220 సీట్ల పంపిణీ కింద ప్రకారం ఉంటుంది.
CON, AFMC, పుణెలో 40 సీట్లు, CON, CH (EC)కోల్‌కతాలో 30 సీట్లు, CON, INHS అస్వినిలో 40 సీట్లు CON, AH (R&R) న్యూఢిల్లీలో 30 సీట్లు, CON, CH (CC), లక్నోలో 40 సీట్లు, CON, CH (AF) బెంగళూరులో 40 సీట్లు
అర్హ‌త‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ(బోట‌నీ & జువాల‌జీ), ఇంగ్లిష్ స‌బ్జెక్టుల‌తో మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఇంట‌ర్ లేదా 10+2 లేదా త‌త్స‌మాన ప‌రీక్షలో క‌నీసం 50శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త‌. నిర్దిష్ట శారీర‌క ప్ర‌మాణాలు (క‌నీసం 152 సెం.మీ ఎత్తు) క‌లిగి ఉండాలి. అవివాహిత‌/ విడాకులు/ లీగ‌ల్‌గా విడిపోయిన మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వ‌య‌స్సు: 1 అక్టోబ‌రు, 1996 నుంచి 30 సెప్టెంబ‌రు, 2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.750/- దరఖాస్తు ఫీజు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఒకసారి చెల్లించిన రుసుము తిరిగి ఇవ్వరు అనే విషయం అభ్యర్థులు గమనించాలి.
ఎంపిక: క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామినేష‌న్ (సీబీఈ), ఇంట‌ర్వ్యూ ద్వారా
ప్రవేశ పరీక్ష (ఆన్‌లైన్ మోడ్), ఇంటర్వ్యూ రౌండ్ మరియు వైద్య ప్రమాణాలను నెరవేర్చడంలో వారి పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సీబీఈ ప‌రీక్ష 90 నిమిషాలు ఉంటుంది. దీన్ని ఏప్రిల్ 2021లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షను క్లియర్ చేసి, మెరిట్ జాబితాలో ఉన్న వారిని జూన్ 2021లో ఇంటర్వ్యూ రౌండ్‌కు పిలుస్తారు.
పరీక్షా విధానం: పరీక్ష ఆన్‌లైన్(సిబిటి) విధానంలో 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. పరీక్షలో 50 మల్టిపుల్ చాయిస్-టైప్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు లేదా ప్రతికూల మార్కింగ్ లేదు
సబ్జెక్ట్ పేర్లు ప్రశ్నలు మార్కులు వ్యవధి
జనరల్ ఇంటెలిజెన్స్ 50 50
జనరల్ ఇంగ్లీష్ 50 50 90 నిమిషాలు
సైన్స్ (పిసిబి) 50 50
పరీక్షా కేంద్రాలు: ఆగ్రా, జలంధర్, దానపూర్, జైపూర్, భోపాల్, జబల్పూర్, సికింద్రాబాద్, నామ్కుమ్, అంబాలా, బెంగళూరు, తిరువనంతపురం, ఎజిమాలా (కన్నానూర్), బరాక్‌పూర్, జమ్మూ, ఝాన్సీ, పుణె, చండీమండిర్, విశాఖపట్నం, కోయంబత్తూర్, కిర్కీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, కొచ్చి, గౌహతి, కాన్పూర్, మీరట్, డెహ్రాడూన్, లక్నో, ఢిల్లీ
గ‌మ‌నిక: దరఖాస్తు రుసుం చెల్లించిన తర్వాత అభ్యర్థులు ప్రాధాన్యత ప్రకారం పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. పరీక్షా కేంద్రాల కేటాయింపు ‘మొదటి దరఖాస్తు-మొదటి కేటాయింపులు’ ప్రాతిపదికన జరుగుతుంది. ఆ విధంగా ఫారమ్‌ను సకాలంలో సమర్పించండి.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివ‌రి తేదీ: 10 మార్చి, 2021
వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in లో పూర్తి వివరాలు పొందుపరిచారు.

Advertisement

Next Story

Most Viewed