సివిల్స్ అభ్యర్థులకు శుభవార్త

by GSrikanth |
సివిల్స్ అభ్యర్థులకు శుభవార్త
X

దిశ, తెలంగాణ బ్యూరో: యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల సౌలభ్యం కోసం ఉచిత అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులకు మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడం ఎలా అనే అంశంపై ఈనెల 12వ తేదీన సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

అశోక్ నగర్ లోని అకాడమీలో ఈ సదస్సు ఉంటుందని పేర్కరొన్నారు. ఈ సదస్సులో సివిల్స్ సబ్జెక్ట్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఆప్షనల్ ఎంపిక, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. రెండు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు 040-35052121, 8686233879 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

Advertisement

Next Story