ప్రియురాలితో సహజీవనం.. కోరిక తీరాక గర్భం దాల్చిందని మరో అఘాయిత్యం

by Sumithra |   ( Updated:2021-09-01 05:10:23.0  )
ప్రియురాలితో సహజీవనం.. కోరిక తీరాక గర్భం దాల్చిందని మరో అఘాయిత్యం
X

దిశ, వెబ్‌డెస్క్: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని ఒకే ఇంట్లో సహా జీవనం చేస్తూ శారీరకంగా దగ్గరయ్యారు. ఫలితంగా ఆమె గర్భవతి అయ్యింది.. అదే ప్రియుడికి నచ్చలేదు. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవల వలన గర్భవతి అని కూడా చూడకుండా ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ దారుణ ఘటన హర్యానాలో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. సోనిపట్ గ్రామంలో ఉద్యగం చేస్తున్న ప్రగతి అనే యువతికి రాహుల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే వారి పరిచయం ప్రేమగా మారింది. దీంతో వారు ఒకే ఇంట్లో సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకుంటానని రాహుల్, ప్రగతిని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఫలితంగా ఎనిమిది నెలల క్రితం ప్రగతి గర్భం దాల్చింది. కొన్ని రోజులు విభేధాలు లేకుండా ఉన్న రాహుల్ ఇటీవల ప్రగతితో గొడవ పడడం మొదలుపెట్టాడు. రోజూ చిత్రహింసలు పెడుతూ వేధిస్తుండేవాడు. ఈ క్రమంలోనే సోమవారం వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన రాహుల్.. ఎనిమిది నెలల గర్భవతి అని కూడా చూడకుండా ప్రగతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. మంటల మధ్యలో కొట్టుకుంటున్న ప్రగతిని స్థానికులు రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 90 శాతం శరీరం కాలిపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా బిడ్డ పుట్టి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బుధవారం ఆమె స్పృహలోకి రావడంతో ఆమె నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు రాహుల్‌పై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Advertisement

Next Story