- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాన్ కల్చర్ ఇన్ బాలీవుడ్..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌కు కాంట్రవర్సీలకు అవినాభావ సంబంధం ఉంది. పర్సనల్ లేదా పబ్లిక్..కాంట్రవర్సీ ఏదైనా సరే పర్యవసానం మాత్రం ఘోరంగా ఉంటుంది. లాక్‌డౌన్‌లో ఈ ప్రభావం మరింత గట్టిగా పడింది. సోషల్ మీడియా ఎఫెక్టో లేక లాక్‌డౌన్‌లో పనిపాట లేక విమర్శకులు ఖాళీగా ఉండటమో తెలియదు. కానీ, బాలీవుడ్‌కు కోలుకోలేని దెబ్బ పడింది. బాలీవుడ్ బ్యాన్ ఏ మేరకు జరిగిందంటే..రిలీజ్ అయిన సెలెబ్రిటీస్ మూవీస్ దాదాపు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణంతో నెపోటిజం అంటూ ఓ ఇష్యూ తెరపైకి రాగా, అప్పట్నుంచి ఇప్పటి వరకు రోజుకో ఇష్యూ వస్తోంది. వీటి ద్వారా బాలీవుడ్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతూనే ఉంది. ముఖ్యంగా బ్యాన్ కల్చర్ అనే ఓ ట్రెండ్..దర్శక, నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. కరోనా కారణంగా దర్శక, నిర్మాతలు ఓటీటీని ఆశ్రయిస్తే చావు దెబ్బ కొట్టారు ఓ వర్గానికి చెందిన సోషల్ మీడియా యూజర్స్. ఎంత గొప్ప స్టార్స్ ఉన్నా సరే బాలీవుడ్ బాయ్‌కాట్, బ్యాన్ ది బాలీవుడ్ అంటూ ప్రచారం చేస్తున్నది. మతం రంగు పులుముతూ మరింత ఎఫెక్ట్ పెంచుతుంది. బ్యాన్ కల్చర్ తెరమీదకు తీసుకొచ్చి మైండ్ లెస్‌గా బిహేవ్ చేస్తున్నారని ఆటోమేటిక్‌గా అర్థమైపోతున్నా సరే..ఈ ప్రచారం వల్ల ఎంతో కొంత ఆడియన్స్‌పై ప్రభావం పడక తప్పడం లేదు. సినిమాలు ఫ్లాప్‌టాక్ తెచ్చుకోక తప్పడం లేదు. అ కోవలోకి చెందినవే..ఆలియా భట్ ‘సడక్ 2’, అనన్యా పాండే, ఇషాన్ ఖట్టర్ ‘కాలీ పీలి’, జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’. ఈ సినిమాలకు నెపోటిజాన్ని ఆపాదించి ఫ్లాప్ టాక్ తేవడంలో సక్సెస్ అయిన వర్గం..ఇక నుంచి కూడా అదే ట్రెండ్‌తో బాలీవుడ్‌ను తిప్పలు పెట్టాలనే డిసైడ్ అయిపోయిందని తెలుస్తూనే ఉంది.
సడక్ 2 సినిమా హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని టాక్ తీసుకురావడంలో ఓ గ్రూప్ సఫలమైంది. మూవీ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి రిలీజ్ వరకు అదే నెగెటివిటి పోట్రేట్ చేయడం ద్వారా సినిమాను ఫ్లాప్ చేయడంలో సక్సెస్ అయింది. పైగా సుశాంత్ మరణానికి మహేష్ భట్, ఆలియా భట్‌కు కనెక్షన్ పెడుతూ యూట్యూబ్‌లో మోస్ట్ డిస్‌లైక్డ్ ట్రైలర్‌గా చేసి ఆ విధంగా కూడా ట్రెండింగ్‌లో నిలిచేలా చేశారు.
ఇక సరికొత్తగా దీపావళి కానుకగా ఈ నెల 9న రిలీజ్ కాబోతున్న అక్షయ్‌కుమార్, కియారా అద్వానీ సినిమా లక్ష్మీని టార్గెట్ చేస్తున్నారు. బ్యాన్ లక్ష్మీ మూవీ అంటూ ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిన ఓ వర్గం క్రిస్టియన్ అయిన డైరెక్టర్ రాఘవ లారెన్స్, ముస్లిం వర్గానికి చెందిన నిర్మాత కలిసి హిందూ దేవతను ఇన్‌సల్ట్ చేస్తున్నారని, ఇది ‘లవ్ జిహాద్’ కాదా అని నూరిపోస్తూ, లక్ష్మీని బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన మీర్జాపూర్ 2 విషయంలోనూ ఈ బ్యాన్ కల్చర్ కొనసాగింది. నటుడు అలీ ఫజల్ సీఏఏ మూమెంట్‌లో పాల్గొన్నాడని సో.. మీర్జాపూర్ 2ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. తనిష్క్ కమర్షియల్ యాడ్ విషయంలోనూ క్యాన్సల్ కల్చర్ ముఖ్యపాత్ర పోషించింది. అన్ని మతాలకు రెస్పెక్ట్ ఇస్తూ యాడ్ చేసినా సరే..అందులోనూ తమ మతాన్ని కించపరిచారంటూ గోల చేశారు.
ఫైనల్‌గా కల్చర్‌కు రెస్పెక్ట్ ఇచ్చేవారు ఇస్తుంటారు.. అదే సమయంలో కల్చర్‌ను రిలీజియన్ అంటూ ప్రతీ విషయంలో తప్పును వెతికి కిందకు తొక్కేవారు.. గొడవలు సృష్టించేవారు ఉంటారు. కానీ మనుషుల మీద నెగెటివ్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.. అందుకే లాక్ డౌన్‌లో బాలీవుడ్ బ్యాన్ ట్రెండ్ అయింది.. బ్యాన్ జరిగింది కూడా.