'అయ్యో బాలుడా'.. వీడియో వైరల్

by Shamantha N |   ( Updated:2020-07-01 04:06:58.0  )
అయ్యో బాలుడా.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో అంటూ ఆ బాలుడిని తలచుకుంటున్నారు. విషయమేమైందంటే.. జమ్మూకాశ్మీర్ లోని సోపూర్ లో బుధవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో తన మనవడితో అటు వైపుగా వెళ్తున్న ఓ వ్యక్తికి బుల్లెట్లు తగిలి మృతి చెందాడు. దీంతో ఆ వ్యక్తి మనవడు తన తాత మృతి చెందాడని తెలియక ‘తాత లే.. తాత లే.. ఏమైంది’ అంటూ ఆ వ్యక్తి మృతదేహం వద్ద కూర్చుని ఏఢుస్తూ ఉన్నాడు. ఇది గమనించిన భద్రతా దళాలు ఆ చిన్నారిని అక్కడి నుంచి పక్కకు వెళ్లమని చెప్పారు. దీంతో ఆ పిల్లాడు ఆ ప్రదేశం నుంచి పక్కకు వెళ్లాడు. అనంతరం ఆ బాలుడిని భద్రతా దళాలు సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Advertisement

Next Story