వీరిద్దరూ తల్లీకుమారుడు.. ఒకేసారి టెన్త్ పాస్

by Anukaran |
వీరిద్దరూ తల్లీకుమారుడు.. ఒకేసారి టెన్త్ పాస్
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. తల్లి, కుమారుడు ఒకేసారి పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన బేబీ గౌరవ్(36), ప్రదీప్ గౌరవ్(16) అనే వీరిద్దరూ తల్లీకుమారులు. అయితే, వీరిద్దరూ కూడా ఒకేసారి పదో తరగతి పరీక్షలు రాశారు. అందులో తల్లి 64.40 శాతం మార్కులు సాధించింది. కుమారుడు 73.20 శాతం మార్కులు సాధించాడు.

వీరిద్దరూ ఒకేసారి పరీక్షలు రాసి ఒకేసారి పాసవ్వడంతో అందరూ ప్రశంసిస్తున్నారు. ‘నాకు చిన్నతనంలో పెళ్లి అయ్యింది. కానీ, చదువుకోవాలన్న కోరిక బలంగా ఉంది. భర్త ప్రోత్సాహం, కుమారుడి సహకారంతో పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యాను’ అంటూ ఆనందంగా బేబీ గౌరవ్ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story