- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
#BollywoodStrikesBack.. మీడియా సంస్థలపై కేసు
దిశ, వెబ్‌డెస్క్: ‘బాలీవుడ్ స్ట్రైక్స్ బ్యాక్’ పేరుతో కలిసి వచ్చిన ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ.. న్యూస్ చానల్స్‌పై ఢిల్లీ కోర్టులో సివిల్ సూట్ వేసింది. బాలీవుడ్ ప్రతిష్టను, కీర్తిని దెబ్బతీసేలా.. ఇండస్ట్రీకి వ్యతిరేకంగా న్యూస్ పబ్లిష్ చేయడంపై మీడియా చానల్స్, సోషల్ మీడియాను ప్రశ్నించింది. బాలీవుడ్ ఇండస్ట్రీ అసోసియేషన్స్‌తో పాటు 34 మంది బాలీవుడ్ నిర్మాతల తరపున డీఎస్కే పిటిషన్ దాఖలు చేశారు. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్స్ 1994 ప్రకారం బాలీవుడ్‌కు వ్యతిరేకంగా న్యూస్ ప్రసారం చేస్తున్న ‘రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ’ వంటి చానల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని నెలలుగా మీడియా డర్టీ, డ్రగీస్ లాంటి పదాలను వినియోగిస్తోందని.. అలాంటి పదాలు వాడకూడదని సూచించారు.
కాగా, మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన నిర్మాణ సంస్థల లిస్ట్‌లో అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అనిల్ కపూర్, కరణ్ జోహార్‌లకు సంబంధించినవి కూడా ఉన్నాయి.