ప్రియురాలితో కలిసి వరదల్లో చిక్కుకున్న టాప్ సింగర్..

by Anukaran |   ( Updated:2021-07-19 08:44:54.0  )
mika singh news
X

దిశ, వెబ్‌డెస్క్: గత వారం రోజుల నుంచి ముంబైని వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలు కారణంగా సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా సింగ‌ర్, ర్యాప‌ర్ మికా సింగ్ కారు వ‌ర‌ద నీటిలో చిక్కుకుంది. ఆ స‌మయంలో ఆయ‌న‌తో పాటు అతని ప్రియురాలు ఆకాంక్ష పూరి కూడా ఉన్నారు. మికా సింగ్ అతని స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు సంఘటనా స్థలానికి చేరుకొని సాయం చేశారు. “దాదాపు 200 మంది వరకు జనాలు నాకు సాయం చేయడానికి వచ్చారు. వారందరికి నా కృతజ్ఞతలు’’ అని తెలిపారు మికా సింగ్. ఇకపోతే ఆకాంక్ష పూరితో మికా సింగ్ డేటింగ్‌లో ఉన్న‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాము మంచి స్నేహితులమని, తాను నాకు కుటుంబ సభ్యుడితో సమానమని ఆకాంక్ష పూరి ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

Advertisement

Next Story