ఢిల్లీలో ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం

by Mahesh |   ( Updated:2024-12-27 14:09:43.0  )
ఢిల్లీలో ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో సీడబ్ల్యూసీ(CWC) సమావేశం ప్రారంభం అయింది. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (AICC) ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ Congress Working Committee (సీడబ్ల్యూసీ) సమావేశం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే(Mallikarjun Kharge), కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత (ఎల్‌వోపీ) రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో శుక్రవారం సాయంత్రం ఈ సమావేశం ప్రారంభమైంది. అయితే గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ప్రధాని, మన్మోహన్ సింగ్ కి నివాళులర్పించేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. అనంతరం ఆయన మృతికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి.. సంతాపం(Condolences) తెలిపారు. కాగా ఈ సీడబ్ల్యూసీ సమావేశం కర్ణాటకలోని బెల్గాంలో రెండు రోజులపాటు జరగాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed