కంపు కొడుతున్న కాలనీ.. పడకేసిన పారిశుధ్యం

by Naveena |
కంపు కొడుతున్న కాలనీ.. పడకేసిన పారిశుధ్యం
X

దిశ, కమ్మర్ పల్లి: దుర్వాసనతో కాలనీ కంపు కొడుతోంది. కాలువలు సక్రమంగా లేకపోవడంతో..రోడ్డు పైనే మురికి నీరు చేరి గాంధీనగర్ కాలనీ సమస్యలతో ఆల్మటిస్తుంది. కమ్మర్ పల్లి గ్రామ పంచాయతీకి చెందిన గాంధీనగర్ కాలనీలో రోడ్లపైనే మురుగు పారుతూ దుర్వాసన వెదజల్లుతోంది. సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో రహదారులపై మురుగు నిలుస్తుండటంతో..ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దోమల బెడద క్రమేపీ పెరుగుతోంది. దీంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటు రోగాల భారిన పడుతున్నారు. కాలనీలో వేసిన చెత్త కుప్పలను పరిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలించాల్సి ఉంది. ప్రధాన కూడలిలలో పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్లతో చెత్తాచెదారాన్ని తీసుకెళ్తున్నారు. కానీ చిన్నచిన్న కాలనీలలో అంతంత మాత్రంగానే నిర్లక్ష్యంగా పంచాయతీ సిబ్బంది వదిలేస్తున్నారు. రోడ్డుపై చెత్తాచెదారాన్ని శుభ్రం చేసి డంపింగ్ యార్డ్ కు తరలించిన దాఖలు లేవు. కమ్మర్ పల్లి మండల కేంద్రానికి ప్రత్యేక అధికారి ఎంపీడీవో కావటం విశేషం. ఈ కాలనీలో ప్రత్యేక అధికారి,పంచాయతీ కార్యదర్శులు సమయం కేటాయించి పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed