VH: నన్ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునేందుకు మన్మోహన్ ట్రై చేశారు

by Gantepaka Srikanth |
VH: నన్ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునేందుకు మన్మోహన్ ట్రై చేశారు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) చనిపోవడం కాంగ్రెస్(Congress) పార్టీకి, దేశానికి తీరని లోటని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మాజీ ఎంపీ వీ. హనుమంత రావు(VH) అన్నారు. మనముందే మన్మోహన్ సింగ్ మృతిచెందడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థను నిలిపారని, సోనియా గాంధీకి రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా.. ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా చేశారని గుర్తుచేశారు. ఓబీసీ కన్వీనర్‌గా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్‌తో కలిసి పని చేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. ఓబీసీలకు ఐఐటీ, ఐఐఎంలలో రిజర్వేషన్ కోరడంతో వెంటనే బిల్లు ప్రవేశ పెట్టారని వీహెచ్ అన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి ఆ దేవుడు అండగా నిలుస్తారని ప్రార్థిస్తున్నానన్నారు. కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునేందుకు మన్మోహన్ సింగ్ తన పేరును కూడా పరిశీలించారని, అయితే ఆ అవకాశం తనకు దక్కలేదన్నారు.

Next Story

Most Viewed