- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మరణంలోనూ వీడని బంధం.. గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి
by Naveena |

X
దిశ,నేలకొండపల్లి: కట్టుకున్న భార్య చనిపోయిన విషయం తెలిసి భర్త గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రామచంద్రపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాధాటి యశోద(76) హనుమరెడ్డి(81) భార్యాభర్తలు. ఖమ్మం నగరంలో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. ఈ తరుణంలో భార్య యశోదకు ప్రమాదవశాత్తు కింద పడి తలకి బలమైన గాయం కావడంతో.. ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యశోద మృతి చెందింది. దీంతో భార్య మరణించిందని వార్త విన్న హనుమా రెడ్డి గుండె పోటుతో.. అక్కడికక్కడే మరణించాడు. గంట వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందటంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను స్వగ్రామం తీసుకువచ్చారు. వారిని కడసారి చూసేందుకు గ్రామస్థులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
Next Story