మరోసారి ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న శివ కార్తికేయన్.. ఆ పండుగ కానుకగా ‘మదరాసి’.. ఈ సారి కలిసొచ్చేనా?

by Hamsa |   ( Updated:2025-04-15 06:00:00.0  )
మరోసారి ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న శివ కార్తికేయన్.. ఆ పండుగ కానుకగా ‘మదరాసి’.. ఈ సారి కలిసొచ్చేనా?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) గత ఏడాది ‘అమరన్’(Amaran) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రాజ్ కుమార్ పెరియసామి(Rajkumar Periasamy) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆర్మీ మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత సంఘటన ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా.. దీపావళి కానుకగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. ‘అమరన్’ విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే శివ కార్తికేయన్ ఇప్పుడు అదే ఫామ్‌తో వరుస చిత్రాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు.

ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మదరాసి’(Madharasi). ఎ ఆర్ మురుగదాస్(A.R. Murugadoss) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న విజువల్ వండర్‌గా అద్భుత స్థాయిలో రూపొందుతోంది. ఇందులో శివ కార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తుండగా.. విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇక 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మదరాసి’ నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ అంచనాలను రెట్టింపు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి.

తాజాగా, చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ‘మదరాసి’ 2025 సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు వెల్లడిస్తూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘ఆవేశం, విముక్తి మధ్య, ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు’’ అనే క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ పోస్టర్‌లో శివ కార్తికేయన్ గుబురు గడ్డం, జుంపాల జుట్టుతో షాకింగ్ లుక్‌లో కనిపించారు. అయితే ఈ సినిమా దీపావళి కానుకగా థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు సమాచారం. ఇక మరోసారి హిట్ కొట్టేందుకు మళ్లీ అదే పండుగకు రాబోతున్నట్లున్నాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఈ సారి కలిసొస్తుందా? హిట్ కొడతాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed