రాజన్న కోడెలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

by Sridhar Babu |
రాజన్న కోడెలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
X

దిశ, వేములవాడ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాలలోని కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. శుక్రవారం తిప్పాపూర్ లో ఆలయ గోశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోశాల ఆవరణ, అక్కడ చేపడుతున్న పనులను పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గోశాలలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సివిల్ పనులను నిర్దేశిత గడువులోగా చేయాలని సూచించారు. కోడెల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. దాణా, ఇతర విషయాల్లో జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. వారి వెంట జిల్లా పశు సంవర్థక అధికారి రవీందర్ రెడ్డి, ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, ఈఈ రాజేష్, డీఈ రఘు నందన్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed