త్రిష నుంచి ఎన‌ర్జిటిక్ సాంగ్ ‘స‌వదీక‌’ వచ్చేసింది..(వీడియో)

by sudharani |
త్రిష నుంచి ఎన‌ర్జిటిక్ సాంగ్ ‘స‌వదీక‌’ వచ్చేసింది..(వీడియో)
X

దిశ, సినిమా: అజిత్‌కుమార్‌(Ajith Kumar), త్రిష(Trisha) జంటగా నటిస్తున్న చిత్రం ‘విడాముయర్చి’(Vidaamuyarchi). మగిళ్ తిరుమేని (Magill Thirumeni)దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని లైకా ప్రొడ‌క్షన్స్‌పై సుభాస్కర‌న్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా రిలీజ్ కానుంది. ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా మూవీపై భారీ అంచ‌నాలు క్రియేట్ కాగా.. అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇదే జోష్‌తో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను వేరే లెవల్‌కు తీసుకెళ్తూ తాజాగా ‘స‌వదీక‌’ అనే ఫాస్ట్ బీట్ ఎన‌ర్జిటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. ప్రజెంట్ ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈ చిత్రానికి కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుద్(Anirudh) సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ఆర‌వ్‌(Aarav), రెజీనా క‌సండ్ర(Regina Cassandra), నిఖిల్ నాయ‌ర్(Nikhil Nair) త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed