- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big Tiger : నల్లమల సఫారీ రైడ్ లో పెద్దపులి ప్రత్యక్షం
దిశ, వెబ్ డెస్క్ : నాగర్ కర్నూల్ జిల్లా (Nagarkurnool District) అమ్రాబాద్ నల్లమల అభయారణ్యంలో(Amrabad Tiger Reserve Zone Nallamala) సఫారీ రైడ్(Safari Ride)లో ప్రయాణిస్తున్న పర్యాటకుల(Tourists)కు పెద్దపులి(Big Tiger)కనిపించింది. ఆకస్మాత్తుగా ఓ పెద్దపులి పక్కన ఉన్న పొదల్లోంచి సఫారీ వాహనాల ముందుకు వచ్చింది. తమ ఎదురుగా పెద్దపులిని చూసిన పర్యాటకులు సఫారీ రైడ్ ఫలవంతమైందన్న సంబరం ఒకవైపు..పులిని దగ్గరగా చూడటం..అది ఎమైనా తమవైపు వస్తుందా అన్న భయం మరోవైపు మధ్య ఆశ్చర్య ఆందోళనలకు గురయ్యారు. అయితే పులి పర్యాటకులను చూస్తూ గంభీరంగా సఫారీ వాహనాల ముందు నుంచి నడుచుకుంటూ ఆడవిలోకి వెళ్లిపోయింది.
నల్లమల ఫారెస్ట్‌లో భాగమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ అందాలు, వన్యప్రాణుల సందర్శనకు అనువైన ప్రదేశం. ప్రస్తుతం ఇక్కడ ఫరహాబాద్ వద్ద సఫారీ రైడ్, అటవీ ట్రెక్కింగ్, పచ్చని ప్రకృతి దృశ్యాలతో చుట్టుముట్టబడిన కాటేజీలలో బస చేయవచ్చు. చెంచు మడ్ హౌస్, ట్రీ హౌస్, ఏర్కాన్ హౌస్ వంటి విభిన్నమైన వసతులున్నాయి. ఈ టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే అతి పెద్దది. నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల మీదుగా నాగార్జున సాగర్ - శ్రీశైలం అభయారణ్యం 5,937 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పులుల సంరక్షణ కేంద్రం నల్లమల అడవిలో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పులులు, కొన్ని వలస పక్షులతో పాటు, అడవి గుండా ప్రవహించే కృష్ణా నది అభయారణ్యం యొక్క ప్రధాన ఆకర్షణ.
ప్రస్తుతం తెలంగాణ పరిధిలో 42పులులు, 187చిరుత పులులు ఉండగా, వాటిలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్ లో34పులులున్నాయి. అందులో 15ఆడపులులు, 11మగపులులు, 8 పులి పిల్లలున్నాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిధిలో 8పులులు సంచరిస్తున్నాయి. హైదరాబాద్ నుండి దాదాపు 155 కి.మీ.ల దూరంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్ ప్రాంతంలో యాత్రకు రెండు రోజులు సరిపోతాయి.