Love Mistakes : సంబంధాల్లో సంతోషం మిస్ ..! కారణం ఇదేనా ?

by Javid Pasha |   ( Updated:2024-12-27 15:49:44.0  )
Love Mistakes : సంబంధాల్లో సంతోషం మిస్ ..! కారణం ఇదేనా ?
X

దిశ, ఫీచర్స్ : సంబంధాల్లో ప్రేమ ముఖ్యమైందే.. కానీ దానిని మనస్ఫూర్తిగా అనుభూతి చెందితేనే భార్య భర్తలు గానీ, ప్రేమికులు గానీ సంతోషంగా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల సమాజంలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ప్రేమలో బ్రేకప్‌లకు, రిలేషన్‌షిప్‌లో డివోర్స్‌కు దారితీస్తున్నాయి. వీటిని నివారించగలితేనే లైఫ్‌లో హ్యాపీగా ఉండగలుగుతారని నిపుణులు పేర్కొంటున్నారు. అదెలాగో చూద్దాం.

పోలికలు, అపార్థాలు

చాలా మందిలో సంబంధాలు విచ్ఛిన్నం కావడానికి గల ప్రాథమిక కారణాల్లో తమ జీవితాలను ఇతరులతో పోల్చుకోవడం అంటున్నారు నిపుణులు. ఇది ప్రమాదకరణ ధోరణిగా పేర్కొంటున్నారు. నిజానికి ఇతరులు బయటకు కనిపించే విధంగానో, సోషల్ మీడియాలో, సినిమాల్లో కనిపించే పోకడల మాదిరిగానో వారి నిజ జీవితాలు ఉండకపోవచ్చు. పైకి గొప్పగా కనిపించిన వారి విషయంలోనూ అనేక లోపాలు ఉండవచ్చు. సమస్యలతో సతమతం అవుతుండవచ్చు. కాబట్టి సమాజంలో ఎవరినీ ‘సంపూర్ణ’ వ్యక్తులుగానో, వారి జీవితాలు పర్‌ఫెక్ట్ భావించడం, తమను వారితో కంపేర్ చేసుకోవడం సంతోషాన్ని దూరం చేస్తుంది. సంబంధంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఎవరు ఈ పొరపాటు చేసినా ఇబ్బందులు ఎదుర్కొనే చాన్స్ ఉంటుంది. ఇటీవల ఇలాంటి విషయాలే విడాకులకు కూడా కారణం అవుతున్నాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి మీ జీవితం మీది.. ఇతరులతో పోల్చుకొని ఇబ్బందులు కొనితెచ్చుకోకండి.

గతాన్ని తవ్వకండి!

ప్రేమ లేదా సంబంధం జీవితంలో చాలా విలువైంది. అంతేకాకుండా ఇది భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. అర్థం చేసుకున్నప్పుడు లైఫ్ సంతోషంగా ఉంటుంది. అయితే ఒక సంబంధంలోకి అడుగు పెట్టాక భాగస్వామి మీతో బాగానే ఉంటున్న అనుమానించడం, అవతలి వ్యక్తి గతాన్ని తవ్వడం, చిన్న చిన్న పొరపాట్లను కూడా పెద్దవిగా చూస్తూ తప్పబట్టడం వంటివి సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఇలాంటి విషయాల్లో మీ అత్యుత్సాహం చివరికి విడాకులకు, బ్రేకప్‌లకు దారితీయవచ్చు. కాబట్టి గతాన్ని పక్కన పెట్టేసి వర్తమానంలో ఏంటనేది ఆలోచిస్తే.. మీ సంబంధం సంతోషంగా ఉంటుంది.

అతిగా ఆధారపడటం

సంబంధాల్లో కో డిపెండెన్సీ ముఖ్యమే. కానీ ఇది ఓవర్ అయిపోయి వన్‌సైడ్‌గా మారితేనే ప్రమాదం. ఒక వ్యక్తి తన ఆనందం, సుఖం వంటి విషయాల్లో పూర్తిగా అవతలి వ్యక్తిపై ఆధారపడటం, అవతలి వ్యక్తికోసం తాను ఏమీ చేయకపోవడం కూడా ప్రేమలో, సంబంధంలో విచ్ఛిన్నానికి దారితీస్తుంది. పైగా ఓవర్ కో డిపెండన్సీ వల్ల సొంత అవసరాలు, సొంత ఆలోచనలు వంటి వాటిని కోల్పోతారు. ప్రతీ విషయంలో భాగస్వామిని పరిగణనలోకి తీసుకునే ముందుకు సాగుతారు. ఇదే పద్ధతి ఎక్కువ కాలం కొనసాగితే అవతలి వ్యక్తికి విసుగు రావచ్చు. బంధానికి బై బై చెప్పాలని అనిపించవచ్చు.

ఓవర్ రొమాంటిసైజ్

ప్రేమను అతిగా రొమాంటిసైజ్ చేయడం కూడా అవతలి వ్యక్తికి నచ్చకపోవచ్చు. సినిమాలు, సిరీస్‌లు, అశ్లీలత వంటివి కూడా ఇలాంటి భావనకు దారితీయవచ్చు. మీరు కూడా వాస్తవాలతో సంబంధం లేకుండా ఇలాంటి భ్రమలో చిక్కుకుంటే రియల్ లైఫ్‌లో ఇబ్బందులు ఎదర్కోవచ్చు. నిజమైన ప్రేమ వాస్తవానికి పరస్పర గౌరవం, ప్రరేమ, రాజీపడటం, అవగాహన, సహనం వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ వదిలేసి భాగస్వామిని కేవలం రొమాంటిక్ యాంగిల్‌లోనే చూడటం మొదలు పెడితే అవతలి వ్యక్తిలో మీపై ప్రేమ, గౌరవం వంటివి తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ పొరపాటు ఎప్పుడూ చేయకండి.

Read More ...

Wedding Trends : 2025లో పెళ్లి తంతు..! .. ఈ మార్పులదే కీ రోల్!!






Advertisement

Next Story

Most Viewed