- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ మద్యం పట్టివేత
దిశ,జీలుగుమిల్లి: జీలుగుమిల్లిలో సుంకం చెల్లించని తెలంగాణ రాష్ట్రానికి చెందిన 150 మద్యం సీసాలు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరుచుకున్నారు. ఏలూరు జిల్లా వారి సంయుక్త ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె శ్రీను బాబు ఆధ్వర్యంలో జీలుగుమిల్లి మండలం జీలుగుమిల్లి గ్రామంలో సుంకం చెల్లించని తెలంగాణ రాష్ట్రానికి చెందిన 150 మద్యం సీసాలను ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరచుకొని జంగారెడ్డిగూడెం మండలం ఏ.పోలవరం గ్రామానికి చెందిన వేముల నరసింహారావు మీద కేసు నమోదు చేశామన్నారు.
అలాగే జీలుగుమిల్లి మండలం దర్భ గూడెం గ్రామంలో సుంకం చెల్లించని తెలంగాణ రాష్ట్రానికి చెందిన 100 మద్యం సీసాలను స్వాధీన పరచుకొని జక్కుల రవి మీద కేసు నమోదు చేసి మరియు సదరు వ్యక్తులను రిమాండ్ కు తరలించామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీను బాబు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం ,జీలుగుమిల్లి కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో అక్రమ మద్యం నిల్వలు మరియు అమ్మకాలు ఉన్నా గాని బెల్లపు ఊటలు సారా తయారీ కేంద్రాలు గాని మరియు సారాయి అమ్మకాలు జరుగుతున్న గాని ఎవరైనా మాకు సమాచారం అందించినట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీ కే శీను బాబు తెలియజేశారు. ఈ దాడులలో ఎస్ఐలు జి వెంకటలక్ష్మి ఎస్ఎన్ఎస్ సుబ్రమణ్యం మరియు సిబ్బంది పాల్గొన్నారు.