- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టాక్ మార్కెట్‌ను షేక్ చేస్తున్న ‘నైకా’.. అలియా భట్, కత్రినా కైఫ్ ఆస్తులు ఎంత పెరిగాయంటే..?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ‘నైకా’ స్టాక్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. NSE, BSEలో లిస్టింగ్ అయిన 48 గంటల్లో ఈ కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. ఇన్వెస్టర్లు నైకా కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు భారీగా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 10న ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవ్వగా దీని షేర్లు అమాంతం 80 శాతం పెరిగినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. నైకా కంపెనీ సీఈవో ‘ఫాల్గుని నాయర్’ 2012లో స్థాపించిన ఈ కంపెనీ ప్రస్తుతం వరల్డ్ రిచెస్ట్ టాప్ -5 క్లబ్ లో చోటు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఒక మహిళ ఫౌండర్‌గా ఉన్న కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవ్వడం ఇదే తొలిసారి. దీంతో బిజినెస్ దిగ్గజాలు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మహిళా వ్యాపారవేత్తలు కూడా ఫాల్గుని నాయర్ తమకు మార్గదర్శకురాలిగా నిలిచిందని కొనియాడారు.
ఇదిలాఉండగా నైకాలో పెట్టుబడి పెట్టిన వారిలో బాలీవుడ్ దిగ్గజ హీరోయిన్లు కత్రినా కైఫ్ మరియు అలియాభట్‌లు కూడా ఉన్నారు. నైకా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కాకముందు అలియా భట్ రూ.4.95 కోట్లు, కత్రినా రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టగా.. ప్రస్తుతం వీరి షేర్ వాల్యూ భారీగా పెరిగింది. కంపెనీ షేర్లు పెరిగిన విలువ ప్రకారం.. అలియా షేర్స్ రూ.54 కోట్లగా పెరుగగా, కత్రినా షేర్స్ రూ.22 కోట్లకు పెరిగినట్టు తెలుస్తోంది. కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే తమ షేర్స్ విలువ రెట్టింపు స్థాయిలో పెరగడంతో బాలీవుడ్ క్వీన్స్ ఫుల్లు ఖుషీగా ఉన్నట్టు తెలుస్తోంది.