అలా అయితే.. సాధువులందరినీ..

by Shamantha N |   ( Updated:2020-11-09 06:43:08.0  )
అలా అయితే.. సాధువులందరినీ..
X

దిశ, వెబ్‌డెస్క్: అవారా సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అయిన బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా గోవా బీచ్‌లో న్యూడ్ పరిగెత్తిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆయనపై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటి పూజా బేడీ స్పందించారు. మిలింద్ రన్నింగ్ ఫొటోలో ఎలాంటి అశ్లీలత లేదని, అందంగా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అంతేగాకుండా అశ్లీలత అనేది ఊహించుకోవడంలో ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో మిలింద్ అందంగా ఉండటమే తప్పు అయిందని అన్నారు. ఒకవేళ న్యూడిటీ క్రైమ్ అయితే నాగ సాధువులందరినీ అరెస్ట్ చేయాలి. బూడిదను పూసినంత మాత్రాన అలా ఉండటం ఆమోదయోగ్యం కాదు కదా! అని పూజా బేడీ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed